పూజ గురించి మీకు తెలియని సంగతులు

సినీ రంగంలో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతుంటాయి. ఎవరి సినిమా విజయం సాధిస్తుందో.. ఎవరు టాప్ చైర్ లో కూర్చుంటారో చెప్పడం ఎవరి తరం కాదు. మొన్నటి వరకు కొత్త అమ్మాయిగా పిలుచుకునే పూజా హెగ్డే .. నేడు టాలీవుడ్ క్రేజీ భామగా మారిపోయింది. అల్లు అర్జున్ డీజె మూవీలో ఆమె నటన, అందానికి తెలుగు సినీ ప్రేక్షకులు దాసోహం అన్నారు. అందుకే ఆమె చుట్టూ నిర్మాతలు క్యూ కట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించే అవకాశం పట్టేసింది. ఈ క్రేజీ బ్యూటీ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలపై ఫోకస్..

చిన్న కుటుంబంPooja Hegdeపూజా పుట్టి, పెరిగిందంతా ముంబైలోనే. మంజునాధ్, లతా హెగ్డే పూజా తల్లి దండ్రులు. పూజాకి వ్రిశబ్ అనే సోదరుడు కూడా ఉన్నాడు.

ఆరు భాషలు Pooja Hegdeపూజా తల్లి స్వస్థలం కర్ణాటక. మాతృ భాష తులు. ఆ భాషతో పాటు పూజాకి హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, కన్నడ వచ్చు. ఇప్పుడు తెలుగులో కూడా మాట్లాడగలదు.

బిజినెస్ మైండ్ Pooja Hegdeచిన్నప్పటి నుంచి పూజాకి వ్యాపారం అంటే ఇష్టం. నెట్ వర్క్ మార్కెటింగ్ లో అమ్మకు సాయంగా ఉండేది. అందుకే ఎంకామ్ చేసింది. సినీ అవకాశాలు రాకుంటే వ్యాపార వేత్తగా మారిపోయేది.

మిస్ యూనివర్స్ ఇండియా పూజా ఇంటర్ నుంచే మోడలింగ్ చేసేది. 2010 లో నిర్వహించిన అందాల పోటీలో పూజా మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకుంది.

వాణిజ్య ప్రకటనలు పూజా చేసిన అనేక వాణిజ్య ప్రకటనల్లో ఫెయిర్ అండ్ లవ్లీ, మాజా మంచి పేరు తెచ్చి పెట్టాయి. దీంతో సినీ ఛాన్స్ అందుకుంది.

మూగమూడి ఈ ముంబై బ్యూటీకి కోలీవుడ్ నటిగా తొలి అవకాశం ఇచ్చింది. మూగమూడి సినిమాలో పూజా శక్తి రోల్ ని అద్భుతంగా పోషించి ఆకట్టుకుంది. సైమా అవార్డు ను కూడా అందుకుంది.

ఒక లైలా కోసంఒక లైలా కోసంల సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ‘ముకుంద’ సినిమాలో గోపికగా అలరించింది. ఆ చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మొహంజదారో ఇలా మూడు సిన్మాలతర్వాత తన కలల ఇండస్ట్రీ బాలీవుడ్ లోకి ప్రవేశించింది. అది కూడా హృతిక్ రోషన్ తో కలిసి నటించే అవకాశం పట్టేసింది.

ఫెదరర్ కి వీరాభిమాని పూజాకి ఆటలంటే ఇష్టం. టెన్నిస్ అంటే చాలా ఇష్టం. రోజర్ ఫెదరర్ కి వీరాభిమాని.

నవలల పిచ్చి పూజా ఖాళీ దొరికితే పుస్తకం చేతిలోకి వచ్చేస్తుంది. నవలలని నమిలి మింగేస్తుంది. అంటే నవల చదవడంలోకి వెళితే అంత మరిచిపోతుంది. ఇక హ్యారీ పోటర్ సిరీస్ నవలల్ని ఎన్ని సార్లు చదివిందో ఆమెకే గుర్తులేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus