అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘పుష్ప’ చిత్రం నుండీ వస్తున్న అప్డేట్స్ ఆడియెన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పాటలకు విశేషదారణ లభిస్తుంది. ‘దాకో దాకో మేక’ ‘శ్రీవల్లి’ ‘సామి సామి’ వంటి పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ‘సామి సామి’ పాట మాస్ ఆడియెన్స్ ను బాగా అలరిస్తుంది. ఆ క్రెడిట్ అంతా ఆ పాటని అంత జోష్ తో పాడిన సింగర్ మౌనిక యాదవ్ దే అని చెప్పాలి.
ఈమె గురించి ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోయుండొచ్చు. ఈమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. మౌనిక యాదవ్ తెలంగాణ అమ్మాయే. కరీంనగర్ కు చెందిన కనపర్తి ఈమె సొంత ఊరు.ఈమె పెద్దగా చదివింది ఏమీ లేదు.6వ తరగతి వరకు మాత్రమే చదువుకుంది.ఈమెకు ఓ అక్క…ఆమె పేరు పద్మావతి. ఆమె ఎక్కువగా జానపద పాటలు పాడుతుంటుంది. ఆమెతో పాటు మౌనిక కూడా పాటలు పడటంలో నైపుణ్యం పొందింది. 2009లో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో మౌనిక పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని రక్తికట్టించింది.
ఆ తర్వాత వరుసగా ఏ ఉద్యమం జరిగినా మౌనికని కూడా ఆహ్వానించి పాటలు పాడించేవారు.కెసిఆర్ ప్రత్యేక తెలంగాణని సాధించిన తర్వాత మౌనికకి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాన్ని పొందింది. ఆమె పాడిన పాటలు యూట్యూబ్ లో కూడా బాగా ప్రాచుర్యం చెందాయి. అందువల్లనే దర్శకుడు సుకుమార్ ఏరి కోరి ఈమెతో ‘సామి సామి’ పాటని పాడించాడు.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!