సింగర్ మనో అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. అలాగే మన తెలుగు వారికి రజినీకాంత్ ను చూడగానే మనో గుర్తుకు వస్తాడు. ఎన్నో ఏళ్లుగా రజినీకాంత్ కు డబ్బింగ్ చెబుతూ అలాగే పాటలు పాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. మనో ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడు. ఒక పూట భోజనం చేసి రాత్రి కాలి కడుపుతో పడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా పని చేసి సంగీతంపై పూర్తిగా పట్టు సాధించాడు.
ఇక ఆ తరువాత ఎంతో మంది అగ్ర సంగీత దర్శకులతో పాటలు పాడారు. ఆయన కష్టానికి తగ్గ ఫలితమే ఇప్పుడు వందల కోట్లకు అధిపతిని చేసింది అంటారు. అప్పట్లో వచ్చిన డబ్బుతో ఫ్లాట్స్ కొనుక్కున్న మనో వాటితోనే ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నారట. ఇక మనోకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా ఉన్నారు.పెద్దబ్బాయి షకీర్ తమిళ్ సినిమాల్లో నటుడిగా నిలదొక్కుకుంటూ ఉండగా చిన్న కుమారుడు రతేష్ కూడా నటుడిగా బిజీ అవ్వాలని ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక వారి చిన్నారి కూతురు సోఫియా గాయానిగా.. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఆమె స్వరాభిషేకంలో కూడా పాటలు పాడి దిగ్గజ గాయకులు ప్రశంసలు అందుకుంది. మనో ముస్లిం అయినా కూడా అన్ని మతాల దైవలను సమానంగా పూజిస్తారు. తిరుమలకు అలాగే శబరిమలకు కూడా వెళుతుంటారు.