Sridevi: హీరోయిన్ మహేశ్వరి కాదు శ్రీదేవి సొంత చెల్లెలు శ్రీలతేనట..!

అప్పట్లో తన అందంతో అభినయంతో సౌత్ తో పాటు నార్త్ ఇండస్ట్రీలను కూడా ఓ ఊపు ఊపేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అతిలోక సుందరి శ్రీ‌దేవి. ఈమెకు చెల్లెలు ఉంద‌నీ, ఆమె పేరు శ్రీ‌ల‌త అనీ బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండదు.అయితే హీరోయిన్ మ‌హేశ్వ‌రిని శ్రీ‌దేవి సొంత చెల్లెలు అని అంతా అనుకుంటూ ఉంటారు. మ‌హేశ్వ‌రి.. శ్రీ‌దేవికి క‌జిన్‌ మాత్రమే.! కానీ శ్రీ‌ల‌త‌ శ్రీ‌దేవికి సొంత చెల్లెలు. అంతేకాదు వీళ్ళకి ఒకరంటే మరొకరికి పంచ‌ప్రాణాలు.

శ్రీలత తన చెల్లెలు మాత్రమే కాదు మంచి మెంటర్ అలాగే బెస్ట్ ఫ్రెండ్ అని గతంలో శ్రీదేవి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. బోనికపూర్ తో పెళ్లయ్యే వరకు శ్రీదేవి కి శ్రీలతనే అంతా అన్నట్టు వ్యవహరించేది. శ్రీ‌దేవి న‌టించిన ప్రతీ సినిమా ప్రొజెక్ష‌న్ కు తన చెల్లెల్ని కూడా తీసుకువెళ్లేది శ్రీదేవి. అంతేకాదు తన అక్క‌తో క‌లిసి షూటింగ్‌కు వెళ్ల‌డం అంటే శ్రీలతకి చాలా ఇష్టం . చిన్న‌ప్పుడు వీళ్ళిద్దరూ ఒక తెలుగు సినిమాలో అక్కాచెల్లెళ్లుగా న‌టించారు కూడా.! ఇదిలా ఉండగా.. శ్రీలత సంజ‌య్ రామ‌స్వామి అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది.

అక్క కంటే ముందే శ్రీలత పెళ్లి జరిగినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ దాని పై ఎటువంటి క్లారిటీ లేదు.ఇదిలా ఉండగా.. ఎంతో ప్రేమగా కలిసుండే ఈ అక్కాచెల్లెళ్ల మ‌ధ్య ఆస్తి గొడ‌వ‌లు కూడా జరిగాయి. దాంతో చాలా కాలం పాటు వీరిద్దరూ దూరమయ్యారు.10ఏళ్ళ వరకు వీళ్ళు దూరమయ్యారు.అయితే తర్వాత కలిసిపోయారు లెండి. శ్రీ‌దేవి దుబాయ్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ బాత్‌ట‌బ్‌లో మృతిచెందిన టైమ్‌లో శ్రీ‌ల‌త కూడా ఆమె దగ్గరే ఉంది. శ్రీ‌దేవి మృతి పై ఈమె కొన్ని నిజాలు బయటపెట్టే అవకాశం ఉందని ప్ర‌చారం జరిగింది కానీ అలాంటిదేమి జరగలేదు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus