మెగాస్టార్ చిరంజీవి మరియు నిర్మాత దేవి ప్రసాద్ కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్లో ‘అల్లుడా మజాకా’ ‘మంచి దొంగ’ ‘ఘరానా మొగుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. వీటితో పాటు ‘మృగరాజు’ అనే చిత్రం కూడా వచ్చింది.హీరోకి, నిర్మాతకి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇక దర్శకుడు గుణశేఖర్ మరియు చిరంజీవి లు కలిసి అప్పటికే ‘చూడాలని ఉంది’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని చేశారు. ఇవి చాలవా.. ‘మృగరాజు’ సినిమా పై అంచనాలు పెరగడానికి. అందుకే నిర్మాత దేవి ప్రసాద్ కూడా గుడ్డిగా ఈ చిత్రానికి.. ఆరోజుల్లోనే 15కోట్ల భారీ బడ్జెట్ పెట్టేసాడు.
ఆ చిత్రంలో నటించిన జాక్ అనే సింహానికే నిర్మాత 67 లక్షలు ఖర్చు చేసాడు. ఇక చిరు ఇంట్రొడక్షన్ సాంగ్ కు 60 లక్షలు ఖర్చు చేసాడట.ఇక హీరోయిన్ గా మొదట సోనాలి బింద్రే ను అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు చెయ్యలేకపోయింది.ఇక ‘ఘోస్ట్ అండ్ డార్క్ నెస్’ అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని మొదట జయంత్.సి.పరాన్జీ తెరకెక్కించాలి అనుకున్నాడట. కానీ దర్సకుడిగా చివరికి గుణశేఖర్ ను ఫైనల్ చేశారు. సరే ఎంత బడ్జెట్ పెట్టినా.. మెగాస్టార్ క్రేజ్ కారణంగా సినిమాకి కొన్నిఅగ్రిమెంట్లతో బిజినెస్ బాగానే జరిగింది. ఆడియో రైట్సే కోటి రూపాయలకు అమ్ముడుపోయాయి.
ఇక 2001 జనవరి 11న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మొదటి షోకే చిరు ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. అదే రోజున నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహ నాయుడు’ కూడా విడుదలయ్యింది. సాయంత్రానికి ఆ చిత్రం పుంజుకోవడం.. ‘మృగరాజు’ పడుకోవడం జరిగింది. ఫైనల్ గా ‘మృగరాజు’ చిత్రం పెద్ద ప్లాప్ గా మిగిలింది. ఈ చిత్రానికి వచ్చిన నష్టాల కారణంగా నిర్మాత కూడా చాలా వరకూ దుకాణం సర్దేసాడు.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!