19 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి డైరెక్టర్ జయంత్ చెప్పిన ఆసక్తికరమైన సంగతులు..!

  • January 12, 2021 / 04:51 PM IST

మహేష్ బాబు కెరీర్లో ‘ప్లాప్ సినిమాలకు కూడా ఓ మంచి గౌరవం ఉంటుంది’ అని ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద వాళ్ళు చెబుతుంటారు. ఆ లిస్ట్ లో ‘ఖలేజా’ ‘1 నేనొక్కడినే’ సినిమాలతో పాటు ‘టక్కరి దొంగ’ గురించి కూడా వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2002 జనవరి 12న విడుదలయ్యింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 19ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ చిత్రం విడుదలైన టైములో థియేటర్ల మొహం చూసిన ప్రేక్షకులు చాలా తక్కువ. ఇక సినిమా చూసిన వాళ్ళు కూడా ప్లాప్ అన్నారు. కానీ బుల్లితెర పై ఈ చిత్రం చూసిన కుర్రకారు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. జయనన్ విన్సెన్ట్ అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్.

హాలీవుడ్ రేంజ్లో ఈ కౌబాయ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు జయంత్. ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఈ చిత్రాన్ని స్వయంగా అతనే నిర్మించడం. నిజానికి దర్శకుడు జయంత్ తో సినిమా చెయ్యడానికి ఆ టైములో నిర్మాత కె.యస్.రామారావు ముందుకు వచ్చారట. కానీ కౌబాయ్ నేపథ్యంలో సినిమా అని జయంత్ అనగానే.. రామారావుగారు టెన్షన్ పడ్డారట.అది గమనించిన జయంత్ ‘నిర్మాత పై భారం పెట్టడం ఎందుకులే’ అని భావించి ఆ చిత్రాన్ని నిర్మించే బాధ్యతను కూడా నెత్తిన పెట్టుకున్నాడట. కృష్ణ, మహేష్ బాబు లు కూడా ముందుగా హెచ్చరించారట. ముఖ్యంగా కృష్ణ గారు ‘ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని నిర్మించి..అది సూపర్ హిట్ అయినా డబ్బులు రాబట్టుకోలేకపోయానని ఆయన అనుభవాన్ని జయంత్ కు చెప్పారట. ‘మంచి ప్రేమ కథా చిత్రం చేస్తే డబ్బులు మిగులుతాయి’ అని కూడా సలహా ఇచ్చారట. కానీ దర్శకుడు జయంత్ మాత్రం ‘టక్కరి దొంగ’ చెయ్యాలని బలంగా ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమాకి మహేష్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా ప్లాప్ అయ్యి దర్శకుడు జయంత్ డబ్బులు పోగొట్టుకున్నాడు.. అయినప్పటికీ ఆ టైములో మహేష్ కు ఫోన్ చేసి ‘ఎంతో కొంత తీసుకో’ అని అడిగాడట. దానికి మహేష్.. ‘నీకేమైనా పిచ్చా’ అని తిట్టాడట. ‘ఆ సినిమా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను’ అని మహేష్ చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని కూడా జయంత్ తెలిపాడు. ఇక ‘టక్కరి దొంగ’ సినిమాకి నష్టాలు వచ్చినప్పటికీ.. ఆ చిత్రం దర్శకుడిగా తనను మరొక మెట్టు పైకి ఎక్కించిందని.. తన ప్యాషన్ తెలుసుకున్న నిర్మాతలు వరుసగా ‘ఈశ్వర్’ ‘లక్ష్మీ నరసింహా’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ వంటి చిత్రాలను చేసే అవకాశాలు ఇచ్చారని.. దాంతో ‘టక్కరి దొంగ’ నష్టాలను తీర్చేసానని జయంత్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus