Actress Priya: నటి శైలజా ప్రియ రియల్ లైఫ్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

నటి ప్రియ గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 42ఏళ్ళ వయసులో కూడా తన గ్లామర్ ఫొటోలతో కుర్ర కారుని ఆకట్టుకుంటుంది ప్రియా. కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియ మెల్ల మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె పూర్తి పేరు పేరు మామిళ్ల శైలజా ప్రియ. ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల ఈమె సొంత ఊరు. ఈమె వయసు 42 ఏళ్లు. 20 మే 1978 లో ఈమె జన్మించింది.

ఈమె తండ్రి శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు గారు, తల్లి మామిళ్ల కుసుమ కుమారి. అవ్వడానికి ఈమె ఆంధ్రప్రదేశ్ కు చెందినావిడే అయినప్పటికీ ఈమె చదువు మొత్తం హైదరాబాద్లోనే జరిగింది. ఈమె చదువు పూర్తయిన వెంటనే.. ‘ప్రియసఖి’ అనే సీరియల్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సీరియల్ మంచి హిట్ అవ్వడంతో ఆ తరువాత ఈమెకు వరుస ఆఫర్లు దక్కాయి.’సంఘర్షణ’, ‘లేడీ డిటెక్టివ్’, ‘మిసెస్ శారద’, ‘జ్వాల’.. వంటి సీరియల్స్ తో పాపులర్ అయిన ప్రియ..

‘రాజకుమారుడు’, ‘అన్నయ్య’, ‘జయం మనదేరా’, ‘చిరునవ్వుతో’, ‘ఢమరుకం’, ‘కత్తి కాంతారావు’, ‘మిర్చి’, ‘ఇద్దరమ్మాయిలతో’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘పండగ చేస్కో’ , ‘విన్నర్’, ‘బాబు బంగారం’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది. 2002లో ఎం.వి.ఎస్.కిషోర్ తో ప్రియ వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అతని పేరు నిశ్చయ్.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus