Asha Saini: ఒక్కప్పటి హీరోయిన్ ఆశా సైనీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫి కేసులో ఆశాసైనీ పేరు కూడా ఉండడం సంచలనంగా మారింది. ఉమేష్‌ కామత్‌, రాజ్‌కుంద్రా మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణల్లో ఆశాసైనీ పేరు రావడంతో ఈ టాపిక్ పై చర్చ మొదలైంది. బాలీవుడ్ మీడియాలో ఆశాసైనీ ని ఏకి పారేస్తోంది. దీంతో స్వయంగా ఆశా సైనీ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో ద్వారా ఆశాసైనీ ఈ విషయం పై స్పందించారు.

ఆశాసైనీ ఈ విషయం పై స్పందిస్తూ.. “నేను ఎప్పుడూ రాజ్‌ కుంద్రాతో మాట్లాడిన సందర్భాలు లేవు. అందుకే ఈ విషయంపై స్పందించకూడదని ముందుగా అనుకున్నాను. కానీ నన్ను న్యూస్ ఛానళ్లలో దోషిగా చూపిస్తున్నారు. దాంతో ఈ విషయం పై మాట్లాడవలసి వస్తుంది. పో* రాకెట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక నటిని, ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ నుండైనా మాట్లాడుకోవచ్చు. ఆ క్రమంలో నా పేరుని ప్రస్తావిస్తే నాకు ఈ రాకెట్‌కు సంబంధం ఉన్నట్టా?.

‘నాకు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేదు.అందుకే నా పై ఇలాంటి ప్రచారం జోరుగా జరుగుతుందనుకుంట.అసలు నా ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని నిర్దారించకుండా నా పేరు, నన్ను ఈ కేసులోకి లాగడం బాధగా ఉంది. పోర్న్ కేసులోకి ఓ మహిళని లాగితే ఆమె జీవితం ఏమవుతుందో అనే ఆలోచన కనీసం ఉందా?” అంటూ ఆశా సైనీ ఆవేదన వ్యక్తం చేసింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus