టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆమె 49వ వసంతంలోకి అడుగుపెడుతుంది. టాలీవుడ్లో బెస్ట్ కపుల్ ఎవరంటే.. మహేష్, నమ్రత ల గురించే ఎక్కువగా చెబుతుంటారు. తన భర్త, పిల్లల పట్ల ఈమె ఎంత కేరింగ్ గా ఉంటుందో.. మామ గారు కృష్ణ గారి కుటుంబం పట్ల కూడా అంతే కేరింగ్ గా ఉంటూ వస్తోంది నమ్రత. అంతేకాదు మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను అలాగే బిజినెస్ వ్యవహారాలను కూడా చక్కపెడుతూ ఉంటుంది నమ్రత. ఈమె మిస్ ఇండియా అన్న సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే..! 1993 లో ఈమె మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది.
అలాగే గతంలో క్రేజ్ ఉన్న హీరోయిన్ కూడా..! బాలీవుడ్లో అనేక సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా ‘వంశీ’,’అంజి’ వంటి చిత్రాల్లో నటించింది. ‘వంశీ’ చిత్రం షూటింగ్ సమయంలోనే మహేష్ కు అలాగే నమ్రత కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడం.. తరువాత పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. గౌతమ్ అలాగే సితారా.మిస్ ఇండియా అయినప్పటికీ.. పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కేవలం కుటుంబం కోసం సినిమాలను వదులుకుంది నమ్రత. ఇక తన భార్య గొప్పతనం గురించి మహేష్ అనేక సందర్భాల్లో మాట్లాడుతూనే వచ్చాడు.వీరికి సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడాని కొన్ని రేర్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :