Unstoppable2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలంతే.. మరో నాలుగు రోజులలో స్ట్రీమింగ్ కానున్న అన్ స్టాపబుల్ 2!

బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటిసారి బాలయ్య హోస్ట్ గా ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో మేకర్స్ రెండవ సీజన్ ఎంతో ఘనంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ఈ సీజన్ పై భారీ అంచనాలు పెంచారు.

ఇకపోతే తాజాగా ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడమే కాకుండా ఈ సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ ప్రోమోలో బాలకృష్ణ కౌబాయ్ గెటప్ లో అద్భుతమైన డైలాగులు చెబుతూ ఏకంగా సినిమానే తలపించారని చెప్పాలి. ఈ ప్రోమో చూస్తుంటేనే ఈ షో ఎలా ప్లాన్ చేశారో అర్థమవుతుంది.

ఈ సారి ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ ఈ ప్రోమో ఓ లెవల్లో ఉంది.ఇక ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 14వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా బాలకృష్ణ వియ్యంకులు హాజరుకానున్నట్టు సమాచారం.

ఇలా బాలకృష్ణ సీజన్ 2 కార్యక్రమంలో మొదటి గెస్ట్ గా చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ ను ఆహ్వానించి తనదైన శైలిలో ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయింది. ఇక ఈ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ పనులను జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ తో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ కార్యక్రమం రెండవ సీజన్ ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus