Upasana: రామ్‌చరణ్‌కి ‘ఫేమస్‌’ ప్రేమ పరీక్ష పెట్టిన ఉపాసన.. ఆ రోజు ఏమైందో తెలుసా?

పెళ్లికి ముందు రామ్‌చరణ్‌ – ఉపాసన డేటింగ్‌లో ఉన్నారనే విషయం తెలిసిందే. కొన్నాళ్ల ప్రేమ ప్రయాణం తర్వాతే ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ ప్రేమను ఉపాసన ఎలా టెస్ట్‌ చేశారో తెలుసా? ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఓ సగటు అమ్మాయి.. మరో సగటు అబ్బాయిని ఎలా టెస్ట్‌ చేస్తుందో ఉపాసన కూడా అలానే చేశారు. వాళ్ల ప్రేమ టెస్ట్‌ జరిగింది హైదరాబాద్‌లో బాగా ఫేమస్‌ అయిన మొజంజాహీ ఫేమస్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌. అవును.. అక్కడే రామ్‌ ప్రేమను ఉపాసన ఓకే చేసింది.

Upasana

ఓ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావో తెలియాలంటే నన్ను ఫేమస్‌ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కి తీసుకెళ్లు అని ఉపాసన అడిగారట. అప్పటికే రామ్‌చరణ్‌ స్టార్‌ హీరో. బయటకు అలా వెళ్తే జనాలు ఊరుకుంటారా చెప్పండి. కానీ తన ప్రేమ కోసం ధైర్యం చేసి ఓ రోజు ఉపాసనను అక్కడకు తీసుకెళ్లి ఐస్‌క్రీమ్‌ తినిపించారట. ఆ రోజు ఆ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో తిన్న మూమెంట్స్‌ నేను ఎప్పటికీ మరచిపోలేను అని ఉపాసన చెప్పుకొచ్చారు. తాము లోపల గదిలో కూర్చుని ఐస్‌క్రీమ్‌ తింటుంటే.. బయట జనాల హడావుడి మామూలుగా లేదు అని చెప్పారామె.

ఇక మీ ప్రేమకథ గురించి చెప్పండి అని అడిగితే.. తమది ముట్టుకుంటే స్పార్క్‌లు వచ్చే ‘మగధీర’ లాంటి ప్రేమ కథ కాదని.. చిన్నతనం నుండి ఇద్దరం స్నేహితులం అని.. అలా కొన్నేళ్లకు ప్రేమ పుట్టిందని చెప్పుకొచ్చారు. రెండేళ్ల పాటు తమ ప్రేమ ప్రయాణం సాగిన తర్వాత పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇద్దరూ హైదరాబాద్‌లోనే పెరిగినవాళ్లమని, అయినా ఇద్దరి లైఫ్‌ స్టైల్‌ ఒకలా ఉండేది కాదని.. ఇప్పుడు ఇలా కలసి ఒకటయ్యామని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు ఉపాసన. ఈ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్‌ ఆహారపు అలవాట్లు, కొణిదెల కుటుంబం ఫుడ్‌ హ్యాబిట్స్‌ కూడా చెప్పుకొచ్చారు.

ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus