Upasana, Akira Nandan: అకీరా నందన్ టాలెంట్ కు ఫిదా అయిన ఉపాసన.. ఏం జరిగిందంటే?

పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ కొడుకు అకీరా నందన్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అకీరా నందన్ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఆ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా అకీరా యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణం సాంగ్ కు పియానో వాయించగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. అకీరా నందన్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తే మాత్రం కెరీర్ పరంగా తిరుగుండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కొడుకు పియానో వాయించిన వీడియోను ఉపాసన (Upasana) సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపాసన ఆ పోస్ట్ లో నా ఫోన్ కొన్నింటిని క్యాప్చర్ చేయడం లేదని కానీ అకీరా జస్ట్ సూపర్ అని పేర్కొన్నారు. ఉపాసన షేర్ చేసిన ఈ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అకీరా నందన్ వింటేజ్ పవన్ ను గుర్తు చేస్తున్నారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

అకీరా నందన్ గతంలో ఒక షార్ట్ ఫిల్మ్ కు పియానో వాయించడం ద్వారా వార్తల్లోకెక్కారు. అకీరా నందన్ కు మ్యూజిక్ అంటే ఇష్టం కాగా కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్ విషయానికి వస్తే షూటింగ్ లకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తర్వాత వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారు.

పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని కెరీర్ పరంగా మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పారితోషికం 65 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. పవన్ ప్రాజెక్ట్ లకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus