Upasana, Ram Charan: చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఉపాసన.. ఏమన్నారంటే?

చరణ్ ఉపాసన టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఉపాసన చేసిన సేవా కార్యక్రమాలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో తాజాగా క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయనే సంగతి తెలిసిందే. మెగా, అల్లు ఫ్యామిలీలలోని నటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలలో చరణ్ క్లీంకారను ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు బెస్ట్ డాడ్ అంటూ ఉపాసన కాంప్లిమెంట్ ఇచ్చారు.

ఉపాసన (Upasana) చేసిన ఈ ట్విట్టర్ పోస్ట్ కు ఏకంగా 16500 లైక్స్ వచ్చాయి. రామ్ చరణ్ నిజంగానే బెస్ట్ డాడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడంతో పాటు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ మూవీ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

దిల్ రాజు సెప్టెంబర్ నెలలో ఈ సినిమను రిలీజ్ చేస్తామని చెప్పినా డేట్ ప్రకటించలేదు. అయితే సెప్టెంబర్ నెలలో వినాయక చవితి పెద్ద పండుగ కావడంతో ఆ పండుగకు ఈ సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. దిల్ రాజు బ్యానర్ లో గేమ్ ఛేంజర్ స్థాయిలో షూట్ ఎక్కువ రోజులు జరుపుకున్న మరో సినిమా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా ఆలస్యమైనా ఆ ఆలస్యానికి తగ్గ ఫలితం దక్కుతుందని మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గేమ్ ఛేంజర్ మూవీ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. శంకర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus