Upasana: క్లిన్ కారా తో కలసి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన.. ఫోటో వైరల్!

మెగా ఇంట మూడో తరం వారసురాలు అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లి జరిగిన 11 సంవత్సరాలకు ఆడబిడ్డ జన్మించారు. జూన్ 20వ తేదీ ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు ఇలా నామకరణ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విధంగా చిన్నారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నప్పటికీ చిన్నారి ఫేస్ మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు.

తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి తన మనవరాలితో ఆడుకున్నటువంటి ఫోటోని రాంచరణ్ షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ చిరుత (చిరు తాత) అంటూ కూతురు తరపున రాంచరణ్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ కూడా తన కూతురు ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇకపోతే తన కుమార్తె జన్మించిన తర్వాత వరలక్ష్మీ వ్రతం రావడంతో (Upasana) ఉపాసన తన కుమార్తెతో కలిసి మొదటి వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

చాలా సాంప్రదాయ బద్ధంగా ఈ వ్రతాన్ని ఆచరించారని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా ఉపాసన దేవుడు గదని అంతా ఎంతో అందంగా అలంకరించారు. ఈమె కూడా రెడ్ కలర్ చుడీదార్ ధరించి చాలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. ఇక ఈ పూజలో భాగంగా ఉపాసన తన కుమార్తె క్లిన్ కారాను ఎత్తుకొని పూజా కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… ఇంతకుమించి ఏమీ అడగను తన కుమార్తెతో కలిసి మొదటి వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?</

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus