Upasana: బేబీస్ ఆన్ ద వే అంటున్న ఉపాసన… ఏమైందంటే?

మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా మెగా కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఉపాసన తన వృత్తి పరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా గడపడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా ఈమె మంచి పనులు చేస్తూ మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరాలకు చేరుస్తున్నారు. వ్యక్తిగత జీవితానికి వస్తే ఈమె రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరిద్దరి వివాహం గత 11 సంవత్సరాల క్రితం జరిగింది అయితే వీరి పెళ్లి జరిగిన ఇన్ని సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారారు. ఈ ఏడాది ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. ఈ చిన్నారి జన్మించి ఆరు నెలలు అవుతున్న ఇప్పటివరకు తాను ఎలా ఉంటుందనేది మాత్రం ఉపాసన తెలియజేయలేదు. పెళ్లి తర్వాత 11 సంవత్సరాలకు ఉపాసన బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా బేబీస్ ఆన్ ద వే అంటూ పోస్ట్ చేయడంతో కొంపదీసి ఉపాసన మరోసారి తల్లి కాబోతుందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉపాసన తల్లి కాదు కానీ పెద్దమ్మగా ప్రమోట్ అవుతుందని తెలుస్తోంది. ఉపాసనకు అన్షుపాల్ అనే సోదరి ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె వివాహం గత మూడు సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా జరిగింది.

అయితే తన చెల్లెలు అన్షు పాల్ ప్రస్తుతం తల్లి కాబోతున్నారని దీంతో ఈమె (Upasana) సీమంతపు వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా జరిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉపాసన తన చెల్లితో కలిసి దిగినటువంటి ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన చెల్లెలు తల్లి కాబోతుంది అనే విషయాన్ని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది దీంతో ఎంతో మంది అభిమానులు సినీ సెలబ్రిటీలు అన్షుపాల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus