Upasana: ఉపాసన తాతయ్య బయోపిక్ లో రామ్ చరణ్?

మెగా కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఉపాసన వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను చూసుకుంటూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. ఇకపోతే అపోలో హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి నిన్న 91వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తన తాతయ్య పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన తాతయ్య అపోలో హాస్పిటల్స్ స్థాపించడానికి పడినటువంటి ఇబ్బందులు అలాగే ఈ హాస్పిటల్స్ ఏ విధంగా ముందుకు నడిపించారనే విషయాలన్నింటినీ కూడా ది అపోలో స్టోరీ అనే పుస్తకంలో పొందపరిచారు.

ఇక ఈ పుస్తకాన్ని ఉపాసన నిన్న తన తాతయ్య పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇలా తన తాతయ్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఈ పుస్తకాన్ని లాంచ్ చేసిన అనంతరం ఉపాసన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ ప్రెస్ మీట్ లో భాగంగా తన తాతయ్య గురించి అలాగే అపోలో గురించి తన తాత తన కుమార్తెలలో ఎలా స్ఫూర్తిని నింపారనే విషయాల గురించి స్పష్టంగా ఉందని ప్రతి ఒక్క తండ్రి చదవాల్సిన పుస్తకం ఇది అని ఈమె తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కు ఈమె ఇది అపోలో స్టోరీ బుక్ కూడా తీసుకువచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా విలేకరులు ఉపాసనని ప్రశ్నిస్తూ భవిష్యత్తులో మీ తాతయ్య బయోపిక్ సినిమా చేస్తారా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో తప్పకుండా భవిష్యత్తులో ఈ సినిమా వస్తుందని ఈమె తెలిపారు.

ఇందులో రామ్ చరణ్ నటిస్తారా అనే ప్రశ్న కూడా ఉపాసనకు ఎదురు కావడంతో ఈ ప్రశ్నకు ఉపాసన సమాధానం చెబుతూ.. అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుందని సమాధానం చెప్పారు. ప్రస్తుతం (Upasana) ఉపాసన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus