Upasana: సరైన సమయంలో తల్లి అవ్వాలని నేను అనుకున్నాను: ఉపాసన

కొణిదల వారికి కోడలు.. అపోలో ఆస్పత్రి ఛైర్మన్ మనవరాలు.. అపోలో ఫౌండేషన్ ఛైర్పర్సన్.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి.. ఉపాసన. ఓవైపు ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్కి కూడా సమయం ఇస్తూ లైఫ్ను జాలీగా గడుపుతూ ఉంటుంది. ఓవైపు అపోలో ఆస్పత్రి బాధ్యతలు.. మరోవైపు ఎన్జీవోస్..కు తన టైం కేటాయిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. అయితే ఈమె రామ్ చరణ్ను పెళ్లాడి దాదాపు 10 ఏళ్లు అవుతోంది. అయినా తల్లి కాలేదని మొన్నటిదాకా అందరూ గుసగుసలాడారు. చాలా మంది డైరెక్ట్గానే ఉపాసనను పలు ఇంటర్వ్యూల్లో అడిగారు. దానికి ఉప్సీ తనదైన స్టైల్లో సమాధానం చెప్పి అందరి నోర్లు మూయించింది.

అయితే ప్రస్తుతం ఉపాసన గర్భవతి. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఉప్సీ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి తను బేబీ బంప్తో కనిపించడం లేదంటూ చాలా పుకార్లు వచ్చాయి. వీటికి ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడా పుకార్లన్నింటిని పటాపంచెలు చేస్తూ ఉపాసన ఫస్ట్ టైం తన బేబీ బంప్ కనిపించేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇవాళ మాతృదినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఫస్ట్ టైం ఉప్సీ బేబీ బంప్ చూసి ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడని ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మదర్స్ డే సందర్భంగా ఇవాళ తన బేబీ బంప్ ఫొటో పోస్టు చేసిన ఉపాసన ఆ ఫొటో కింద ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ రాసుకొచ్చింది. అదేంటంటే.. ‘సరైన సమయంలో తల్లి అవ్వాలని నేను అనుకున్నాను. సొసైటీ అడుగుతుందనో.. ఫ్యామిలీ ప్రెజర్ చేస్తుందనో.. నేను తల్లిని కావాలనుకోలేదు. నాకు పుట్టబోయే బిడ్డకు నేను అపరిమితమైన ప్రేమను పంచేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లిని అవ్వాలనుకున్నాను.

ఇప్పుడు నేను ఎమోషనల్గా కూడా రెడీ అయ్యాను. తల్లి కాబోతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నాకు పుట్టిబోయే బిడ్డ ప్రేమ, సంరక్షణకు, పోషణకు అర్హుడు/అర్హురాలు’.. ఫస్ట్ మదర్స్ డే అని హ్యాష్ ట్యాగ్ జత చేసి పోస్టు పెట్టారు.

ఇటీవలే ఉపాసనకు తన ఫ్రెండ్స్ దుబాయ్లో.. ఫ్యామిలీ హైదరాబాద్లో బేబీ షవర్ వేడుకను జరిపారు. ఈ వేడుకలకు తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా హాజరై ఉపాసన – రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఉపాసనకు పుట్టబోయేది అమ్మాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఉపాసన డెలివరీ డ్యూ డేట్ వరకు రామ్ చరణ్ తన షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని బిడ్డ పుట్టాక తన టైం అంతా బేబీతోనే గడుపుతారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus