Upasana: అమ్మను కాబోతున్నాను… మిస్ యూ అత్తమ్మ: ఉపాసన

మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతున్నారని తెలియడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఉపాసన రాంచరణ్ దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే ఉపాసన తల్లి కాబోతుందనే విషయం ప్రకటించిన తర్వాత ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేయడమే కాకుండా కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా ఉపాసన తన తల్లితోపాటు అపోలో హాస్పిటల్ ప్రతినిధులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉపాసన ఈ ఫోటోలను షేర్ చేస్తూ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి అడుగుపెట్టబోతున్నానని అపోలో హాస్పిటల్ ప్రతినిధులు సంగీతారెడ్డి, సునీత రెడ్డి, ప్రీతా రెడ్డి, ఉపాసన తల్లి శోభన కామినేనితో కలసి ఈమె ఫోటోలు దిగారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ తన అత్తయ్య సురేఖను మిస్ అవుతున్నట్లు మిస్ యు అత్తయ్య అంటూ క్యాప్షన్ జోడించారు.

ఇలా ప్రెగ్నెన్సీ తర్వాత మొదటిసారి ఉపాసన తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇక ఉపాసన అపోలో హాస్పిటల్ వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్ సైతం ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఈయన బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus