Upasana: ఆడాళ్లను తక్కువగా అంచనా వేయొద్దంటున్న ఉపాసన.. ఏమైందంటే?

ఈ మధ్య కాలంలో ఓ బ్యాగ్రౌండ్‌ సౌండ్‌తో ‘The Boys’ అంటూ ఓ స్టాంప్‌ లాంటి పేరు మగాళ్లకు చూసే ఉంటారు. అంటే ఇవి బాయ్స్‌ చేసే పనులు అని వాటి అర్థం. అయితే ‘The Girls’ అనే స్టాంప్‌ చూశారా? అదేంటి.. ఇలాంటిది కూడా ఉందా అంటారా? బాయ్స్‌ గురించి ఉన్నప్పుడు, గాళ్స్‌ గురించి ఎందుకు ఉండకూడదు చెప్పండి. ఇప్పుడు ఇదే స్టైల్‌లో రామ్‌చరణ్‌ మీద ఉపాసన ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

ఆ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసుకుని నవ్వుకున్నారు. దీంతో ఆ వీడియో, ఉపాసన స్టోరీ ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. అందులో ఏముంది తెలియాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. ఆ మధ్య అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఓ సరదా సంఘటన గురించి తెలియాలి. ఆ కార్యక్రమంలో రామ్‌ చరణ్, ఉపాసన, సాయిధరమ్‌ తేజ్ ఒకే సోఫాలో కూర్చున్నారు. సోఫా ఇరుకుగా అనిపించడంతో ఉపాసనను చరణ్‌ వేరే సీటులోకి పంపించాడు.

ఆ తర్వాత ఆమెను ఆట పట్టించినందుకు సాయితేజ్‌తో కలసి చరణ్‌ సరదాగా నవ్వాడు. ఆ రోజుల్లో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సీన్‌ తర్వాత చరణ్‌ ఇంటికి వెళ్లాక ఎలాంటి సిట్యువేషన్స్‌ ఫేస్‌ చేసి ఉండొచ్చు అనేది ఓ నెటిజన్‌ వీడియోగా ఎడిట్‌ చేశాడు. గతంలో లాక్‌డౌన్‌ టైమ్‌లో చరణ్‌ ఇంట్లో చేసిన పనులకు సంబంధించిన వీడియోను.. అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల్లో సోఫా సీన్‌కు కలిపి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

‘ఉపాసన మేడమ్‌ రివెంజ్‌ తీర్చుకుంటే ఇలా ఉంటుంది’ అంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నిజానికి ఉపాసన ఆ పని చేశారో లేదో తెలియదు కానీ.. ఆ పోస్ట్‌ను ఉపాసన స్టోరీస్‌లో పెట్టడంతో.. ఫ్యాన్స్ ఫుల్‌గా నవ్వుకుంటున్నారు. మరి దానికి ‘మిస్టర్‌ సి’ ఏమంటాడో చూడాలి. మిస్టర్‌ సి అంటే తెలుసుకుదా.. చరణ్‌ను ఉపాసన అలానే పిలుచుకుంటుంది మరి.


అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus