సినిమా షూటింగ్‌ మొదలెట్టేస్తారట

వరుస సినిమాలు ఒప్పేసుకుంటున్నాడు. సినిమా ఎప్పుడు స్టార్ట్‌ చేస్తాడో అంటూ ఎదురు చూస్తున్న ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ‘రాధే శ్యామ్‌’ పనులు చివరి దశకు చేరుకుంటుండటంతో ప్రభాస్‌ తర్వాతి సినిమా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అన్నీ కుదిరితే ఈ నెలాఖరుకే కొత్త సినిమా చిత్రీకరణ మొదలుపెట్టేస్తాడట. అవును ‘ఆది పురుష్‌’ చిత్రీకరణ ఈ నెలాఖరుకు మొదలవుతుందని సమాచారం. ఓం రౌత్‌ దర్శకుడిగా ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ అనే పాన్‌ ఇండియా సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే.

ప్రకటన నుంచే ఆసక్తిరేపుతున్న ఈ సినిమా చిత్రీకరణను జనవరి ఆఖరును ప్రారంభిస్తామని దర్శకుడు ఓం రౌత్‌ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నాడు. అయితే సీత పాత్రలో నటించే నాయిక ఎవరన్నది ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రకటన వస్తుందట. అయితే సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీని కోసం వర్క్ షాప్​లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో తెరకెక్కుతోంది.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus