ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ సరైన సక్సెస్ ని అందుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘డిస్కోరాజా’ కూడా డిజాస్టర్ అయింది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రవితేజ. తనకు ‘డాన్ శీను’, ‘బలుపు’ లాంటి సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతోంది.
ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి సరైన మాస్ సినిమా ఇదేనంటూ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ‘క్రాక్’ డిజిటల్ రైట్స్ కు కాస్త డిమాండ్ పెరిగినట్లు సమాచారం. తెలుగు ఓటీటీ ‘ఆహా’ తొలిసారి భారీ మొత్తం చెల్లింది ఈ సినిమా కొనడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏడున్నర కోట్ల ఆఫర్ కూడా ఇచ్చిందట. అల్లు అరవింద్ కి నిర్మాత ఠాగూర్ మధుకి ఉన్న సాన్నిహిత్యంతో ఈ డీల్ కి సంబంధించిన చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది.
అయితే డిజిటల్ హక్కుల ద్వారా కనీసం పది కోట్లు సంపాదించాలని నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ సంస్థతో బేరాలు సాగుతున్నట్లు సమాచారం. ఎనిమిది నుండి తొమ్మి కోట్ల రేంజ్ లో డిజిటల్ రైట్స్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. వరుస ప్లాప్ లతో రవితేజ మార్కెట్ కాస్త తగ్గినా.. ఈ సినిమాకి కేవలం డిజిటల్ రైట్స్ ద్వారా రూ.9 కోట్లు వస్తుండడం విశేషమనే చెప్పాలి.
Most Recommended Video
2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!