మొక్కల కోసం కోట్లు ఖర్చు పెడుతోన్న రెబల్ స్టార్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ షూటింగ్స్ లేకపోతే తన ఫామ్ హౌస్ లోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. తన స్నేహితులతో కలిసి చిల్ అవుతుంటాడు. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా ప్రభాస్ ఫామ్ హౌస్ కి వస్తుంటారు. అందరూ కలిసి పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే విషయాన్ని ప్రభాస్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో చెప్పాడు. రాజమౌళి కూడా ప్రభాస్ అంత ఎంజాయ్ చేసే వ్యక్తిని తన జీవితంలో చూడలేదని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ప్రభాస్ ఫామ్ హౌస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి.

హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ ఫామ్ హౌస్ గురించి బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమాలు లేకపోతే ఎక్కువ సమయం తన ఫేమ్ హౌస్ లోనే గడుపుతాడు కాబట్టి దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని.. కొత్త లుక్ తీసుకొస్తున్నారని తెలుస్తోంది. మొక్కలు నాటించి వాటిని ప్రత్యేకంగా చూసుకుంటున్నాడట ప్రభాస్. తన ఫామ్ హౌస్ మొత్తం కూడా ఇప్పుడు మొక్కలతో నింపేశాడు ప్రభాస్. కొన్ని అరుదైన మొక్కలను తెప్పించి వాటిని కూడా తన ఆవరణలో ఉండేలా చూసుకుంటున్నాడట.

వాటి కోసం కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ ప్రకృతి ప్రేమికుడనే సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఓ అడవిని దత్తత తీసుకొని వాటి కోసం రూ.16 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేశాడు ప్రభాస్. ఇప్పటికీ దానికోసం ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తన ఫామ్ హౌస్ ని కూడా మొక్కలతో నింపేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus