గని సినిమాలో హైలెట్ సీన్స్ అవేనట..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటితో కలిసి చేస్తున్న సినిమా గని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలులో చేసిన క్యారెక్టర్ ని మరోసారి గుర్తుచేస్తూ వరుణ్ తేజ్ సినిమాకి ఈ టైటిల్ ని పెట్టారు. బాబాయ్ టైటిల్స్ ఈ అబ్బాయికి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కనబెడితే, రీసంట్ గా గని చిత్రయూనిట్ లోకి స్టార్ హీరో ఉపేంద్ర వచ్చి చేరినట్లుగా సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

వరుణ్ కి అపోజిట్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే, ఇందులో ఉపేంద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది. పాజిటివ్ రోల్ ఉంటుందా లేదా నెగిటివ్ రోల్ ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ని ఫినిష్ చేస్కుంటోంది మూవీ టీమ్. ఈ షూటింగ్ లోకి ఇప్పుడు తాజాగా ఈ కన్నడ సూపర్ స్టార్ వచ్చి చేరడంతో యూనిట్ లో ఫుల్ జోష్ వచ్చింది. అంతేకాదు, హీరోకి, ఉపేంద్రకి వచ్చే సీన్స్ హైలెట్ గా ఉంటాయని చెప్తున్నారు.

బాక్సింగ్ సీన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని టాక్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాని జులై 30వ తేదిన రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రీసంట్ గా రాధేశ్యామ్ యూనిట్ కూడా ఇదే డేట్ ని లాక్ చేసారు. దీంతో ఇప్పుడు గని సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేస్తారా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus