మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోలు, హీరోయిన్లు రిపీట్ అవుతారు కానీ.. మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, మెయిన్ విలన్లు రిపీట్ అవ్వడం చాలా తక్కువ. ఇప్పటివరకు ఆయన తీసిన రీసెంట్ సినిమాలు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ప్రతి సినిమాకు ఓ మాజీ స్టార్ హీరోనో, స్టార్ నటుడినో తీసుకొస్తూ ఉంటారు. అలా ఇప్పుడు మహేష్‌బాబుతో చేయబోయే సినిమాలో ఓ స్టార్ నటుడిని తీసుకొస్తారని వార్తలొస్తున్నాయి. ఆయన ఉపేంద్రనే అన్నది తాజా రూమర్ల సారాంశం.
మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమాలో హీరో అన్నయ్య పాత్ర కీలకమట. దీని కోసం చాలామంది నటులను అనుకొని, ఆఖరకు ఉపేంద్ర దగ్గర ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్. ఆయన నటనలోని వెర్సటాలిటీ పాత్రకు బాగా కలిసొస్తుందని ఆయన ఆలోచనట. ఉపేంద్ర గతంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించారు. అందులో సెమీ విలన్ పాత్రలో మెప్పించారు. ప్రజలకు మంచి చేసే విలన్‌గా అందులో నటించారు ఉప్పీ. ఇప్పుడు మహేష్ సినిమాలో మాత్రం పాజిటివ్ పాత్రతోనే మెప్పిస్తారని అంటున్నారు.
త్వరలో సినిమా పట్టాలెక్కనుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈసారి పెట్టిన డేట్ పక్కా అని అంటున్నారు. ఏప్రిల్ ఆఖరులో లేదా మే మొదట్లో సినిమా స్టార్ట్ అవ్వొచ్చట. ఈలోపు సినిమా నటీనటుల ఎంపిక పూర్తి చేసేస్తారట. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి పూజా హెగ్డే సెలక్షన్ ఒక్కటే అధికారికంగా బయటకొచ్చింది. శ్రీలీలను రెండో హీరోయిన్గా తీసుకున్నారని వార్తలొచ్చాయి. దీనిపై క్లారిటీ లేదు.
సినిమా అనౌన్స్ అయిన కొత్తలో సినిమాకు ‘పార్థు’ అనే పేరు అనుకుంటున్నారని వార్తలొచ్చాయి. ‘అతడు’ సినిమాలోని ‘పార్థు’ పాత్ర ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఈ స్టైల్లో పుకార్లేమీ రాలేదు. మరి త్రివిక్రమ్ అసలు ఏ కథ రాశారు, మహేష్‌బాబును ఎలా చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఎలా చూపించినా గత రెండు సినిమాలకు మించి విజయం అయితే సాధించాలి. ఎందుకంటే ‘అతడు’ ఫర్వాలేదనిపించగా, ‘ఖలేజా’ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.