1998లో సుకుమార్ జీతం.. ఎకరా పొలం కొనచ్చు

  • February 10, 2021 / 05:30 PM IST

లెక్కల మాష్టరుగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎన్నో విద్యా బుద్ధులు నేర్పిన దర్శకుడు సుకుమార్ ఆ తరువాత వెండితెరపై ప్రేమ పాఠాలు నేర్పిన విషయం తెలిసిందే. ఆర్యతో మొదలైన ఆయన సినిమా కెరీర్ రంగస్థలం వరకు అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో మరొక స్థాయికి చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే సుకుమార్ లెక్చరర్ గా హైలెవెల్లో జీతం అందుకునేవారట. అధ్యాపకుడిగా ఉన్నప్పటి సుకుమార్ కెరీర్ గురించి ఆయన శిష్యుడు బుచ్చిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఇంటర్ కాలేజ్ లో నేను సుకుమార్ గారితో సైకిల్ పై సినిమాకు కూడా వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైనా సినిమాకు వెళతాము అంటే క్లాస్ విన్న తరువాతే వెళ్ళాలి అనేవాళ్ళు. అప్పుడప్పుడు 50రూపాయలు కూడా ఇచ్చేవారు. 50 రూపాయలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ. ఇక 1997-98 ఆ మధ్యలో సుకుమార్ గారి జీతం 70వేల వరకు ఉండేది. మా ఏరియాలో అప్పుడు అత్యధికంగా ఒక ఎకరా ధరనే 50 వేలు ఉండేది.

ఆ రేంజ్ లో జీతం అందుకున్న సుకుమార్ గారు వివి.వినాయక్ దిల్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి నెలకు 500రూపాయలు అందుకున్నారు.. అని బుచ్చిబాబు తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప సినిమాకు 10కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్.


వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus