Uppena Movie: ‘ఉప్పెన’ సినిమాకి సెన్సేషనల్ రేటింగ్స్

ఈ మధ్యకాలంలో ఓటీటీ హవా పెరగడంతో టీవీలో వేరే ప్రీమియర్ షోలను పెద్దగా రేటింగ్స్ రావడం లేదు. ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా సరైన రేటింగ్స్ రావడం లేదు. అలాంటిది వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాకి సెన్సేషనల్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. వెండితెరపై భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ‘ఉప్పెన’ సినిమాకి ఏకంగా 18 టీఆర్ఫీ రావడం విశేషం.

ఈ మధ్యకాలంలో ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా ‘ఉప్పెన’ అనే చెప్పాలి. రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాకి 11.66 టీఆర్ఫీ రాగా.. ఇప్పుడు ‘ఉప్పెన’ ఆ రేటింగ్ ని క్రాస్ చేసింది. మెగాహీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలు హీరోహీరోయిన్లుగా పరిచయమైన ఈ సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమయ్యారు. థియేటర్లో ఈ సినిమా చాలా కాలంపాటు ఆడడమే కాకుండా.. నెట్ ఫ్లిక్స్ లో కూడా రిలీజ్ చేయడంతో ఈ సినిమాకి టీవీలో పెద్దగా టీఆర్ఫీ రాదని అనుకున్నారు.

కానీ ఆ అంచనాలు తప్పని నిరూపిస్తూ హయ్యెస్ట్ టీఆర్ఫీను సాధించింది ‘ఉప్పెన’. ఈ సినిమాతో పాటు అదే రోజున విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను కూడా ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. ఈ సినిమాకి 4.86 రేటింగ్ మాత్రమే వచ్చింది. అంటే విజయ్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాను ‘ఉప్పెన’ బీట్ చేసింది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus