మాస్ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో..!

‘మైత్రి మూవీ మేకర్స్’ అండ్ ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ఉప్పెన’. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజానికి గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ కొంత బ్యాలన్స్ ఉండడంతో విడుదల కాలేదు.అయితే దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం పాటలు గతేడాది అంతా సందడి చేసాయి. ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఒక్క పాట ఈ సినిమాకి బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

ఇక అన్ని అడ్డంకులను తొలగించుకుని ఫిబ్రవరి 12న విడుదలకు ముస్తాబయిన ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. 2 గంటల 27 నిమిషాల నిడివి గల ఈ ‘ఉప్పెన’ చిత్రానికి వారు చెప్పిన రివ్యూ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ అంతా యావరేజ్ గా ఉంటుందని అయితే పాటల పిక్చరైజేషన్ బాగుండడం వలన క్లాస్ ఆడియెన్స్ ను మెప్పించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్లో చిన్న ట్విస్ట్ కూడా ఉంటుందని వారు చెబుతున్నారు.

సెకండ్ హాఫ్ నుండీ అసలు కథ మొదలవుతుందని.. విలన్ మొదట హీరో, హీరోయిన్లను విడదీయాలని ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వకపోవడంతో అతను తీసుకున్న నిర్ణయం ఒళ్ళు గగుర్పొడించేలా ఉంటుందట. క్లయిమాక్స్ అనేది చాలా డేరింగ్ అటెంప్ట్ అని.. సినిమాలో కన్విన్సింగ్ గా చెప్పినప్పటికీ మాస్ ఆడియెన్స్ రిసీవ్ చేసుకునే దానినిబట్టి ‘ఉప్పెన’ సక్సెస్ డిపెండ్ అయ్యి ఉంటుందని వారు చెప్పుకొచ్చారు.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus