Uppena: వైష్ణవ్ క్రిష్ మూవీ హక్కులు అన్ని కోట్లా..?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్న హీరోలలో వైష్ణవ్ తేజ్ ఒకరు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు వైష్ణవ్ తేజ్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్ నెల 14వ తేదీ నుంచి ఉప్పెన ఓటీటీలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఉప్పెన సినిమా రిలీజైన సమయంలో ఈ సినిమా త్వరగానే ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం సినిమా రిలీజైన రెండు నెలల తర్వాత సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో ప్రేక్షకులు ఆ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్ వల్ల వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 2.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్, రకుల్ కాంబినేషన్ లో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న రకుల్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు తెలుస్తోంది. దిల్ రాజు క్యాంప్ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను 11 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus