Urvashi Rautela: ఊర్వశి రౌతేలా ఖరీదైన ఇల్లు ఎలా కొందబ్బా..!

సినీ పరిశ్రమలో హీరోయిన్లకి ఎక్కువ లైఫ్ ఉండదు అంటారు. స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్లు అయినా రెండు, మూడేళ్ళకి మించి రాణించడం కష్టం. ఆ టైంలో వాళ్ళు ఎంత పారితోషికం అందుకున్నా రూ.100 కోట్ల వరకు సంపాదించే ఛాన్స్ అయితే ఉండదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా(ఒకప్పుడు), దీపిక పదుకోన్ వంటి వాళ్లకి తప్ప మిగిలిన భామలకు రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టడం అనేది అసాధ్యనే చెప్పాలి. అలాంటిది ఐటెం సాంగ్ లు, స్పెషల్ సాంగ్ లు మాత్రమే చేసే భామలకు రూ.100 కోట్లు వెనకేయడం అనేది గాల్లో మేడలు కట్టడం లాంటిదే అని చెప్పాలి.

కానీ ఓ హీరోయిన్ నిజంగానే భూమి మీద మేడ కట్టేసుకుంది. దాని విలువ ఏకంగా రూ.190 కోట్లట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. అవును..ఊర్వశి రౌతేలా ఇల్లు ఏకంగా రూ.190 కోట్లట. ఈ విషయం పై ఇప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఊర్వశి రౌతేలా ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించింది.కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ నర్తించింది అంతే..! హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో ఆమె చేసిన చిత్రాల సంఖ్య ఇది.

హీరోయిన్ గా (Urvashi Rautela) చేసిన సినిమాలు కూడా 5 కి మించి ఉండవు. తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ ‘ఏజెంట్’ లో ఒక ఐటెం సాంగ్ చేసింది. అలాంటిది ఐటెం సాంగ్స్ కే రూ.190 కోట్ల ఇల్లు కొనే సంపాదన ఎక్కడ నుండి వస్తుంది అన్నది పెద్ద మిస్టరీ. ఆమె ఫ్యామిలీ నుండి వచ్చిన ఆస్తులను అమ్మి అంత పెద్ద ఇల్లు కొనుక్కుంది అనుకోవాలి అన్నా.. ఆమె మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి మాత్రమే అని టాక్. మరి దీని వెనుకున్న రహస్యమేంటో?

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus