Urvashi Rautela: బాలయ్య మూవీపై షాకింగ్ అప్డేట్ ఇచ్చిన ఊర్వశి.. అసలేం జరిగిందంటే?

గత కొన్నేళ్లుగా బాలయ్య (Balakrishna) సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నా బాలయ్య సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కాకపోవడం విషయంలో ఫ్యాన్స్ నుంచి ఒక అసంతృప్తి ఉండేది. అయితే బాలయ్య బాబీ (Bobby) కాంబో సినిమాతో ఆ లోటు తీరబోతుందని తెలుస్తోంది. ఊర్వశి రౌతేలా ఈ సినిమా కోసం పని చేస్తుండగా ఆమె ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన షాకింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు టైటిల్ కూడా రివీల్ కాలేదు.

ఊర్వశి (Urvashi Rautela) తన పోస్ట్ లో బాలయ్య మూవీ పాన్ ఇండియా మూవీ అని క్లారిటీ ఇచ్చేసింది. యూట్యూబ్ లో ఎన్బీకే 109 గ్లింప్స్ ట్రెండింగ్ లో నంబర్ 1 స్థానంలో ఉందని ఆమె కామెంట్లు చేశారు. బాలయ్య బాబీ మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో విడుదలైతే హిట్ కావడం గ్యారంటీ అని రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య మూవీ గ్లింప్స్ కు వస్తున్న రెస్పాన్స్ విషయంలో బాబీ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య బాబీ మూవీ షూట్ కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఎన్నికల తర్వాత ఈ మూవీ షూట్ మళ్లీ మొదలుకానుందని సమాచారం అందుతోంది. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. బాలయ్య బాబీ మూవీ దసరాకు రిలీజ్ కానుందని మళ్లీ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

దసరా పండుగ కానుకగా ఇప్పటికే దేవర సినిమా ఫిక్స్ కాగా బాలయ్య బాబీ మూవీ కూడా అదే సమయానికి రిలీజైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఒక సినిమా నష్టపోయే ఛాన్స్ ఉంది. ఇద్దరు హీరోలు నందమూరి హీరోలు కావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మంచిది కాదని నెటిజన్లు సూచిస్తున్నారు. బాలయ్య బాబీ మూవీ దసరా కానుకగా రిలీజ్ కానున్నట్టు అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus