ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) .. ఇలా చెప్పే కన్నా ఐటెమ్ భామ అంటేనే టాలీవుడ్‌లో ఎక్కువగా తెలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెలుగులో ఆమె ఎక్కువగా అలాంటి పాత్రల్లో కనిపిస్తూ వచ్చింది. రీసెంట్‌గా ఆమె గురించి పెద్ద రచ్చే జరుగుతోంది. చర్చగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది. దీనికి కారణం ఆమె గత కొన్నేళ్లుగా కొనసాగిస్తూ వచ్చిన లూజ్ టంగ్ కార్యక్రమమే. తన పేరు మీద ఓ గుడి ఉందని, అందరూ దర్శించుకోండి కొన్ని ఇబ్బందికర కామెంట్లు చేసింది.
హీరోయిన్లకు గుడి కట్టడం దక్షిణాది వాళ్లకు అలవాటు. గతంలో కొంతమంది నాయికలకు ఈ ‘అక్కర్లేని’ అతి గౌరవం ఇచ్చి వాళ్లను ఆకాశానికెత్తారు. ఈ మాటలు, చేతలు అలవాటు ఉన్న మన వాళ్లకు ఓ హీరోయిన్ వచ్చి నా పేరు మీద గుడి ఉంది అంటే ఎవరైనా నమ్మకుండా ఉంటారా? నమ్మేశారు కూడా. అయితే ఆమెపై ఆ దేవాలయంల అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే.. బద్రీనాథ్ సమీపంలో బామ్నీ అనే గుడి వుంది. ఊర్వశీని బామ్నీ అని ముద్దుగా పిలుచుకొంటారు.
ఈ రెండూ లింక్ పెట్టి ఆమె అలా మాట్లాడింది. నిజానికి ఊర్వశి నుండి ఇలాంటి కామెంట్లు, చేతలు గతంలో జరిగాయి కూడా. ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమా చిత్రీకరణ సమయంలో ఏదో యాక్సిడెంట్ అయిందని, గాయమైందనో ఓ పుకారు బయటికొచ్చింది. టీమ్‌ను కాంటాక్ట్ అయితే అలాంటిదేం లేదు అనే క్లారిటీలు వచ్చాయి. చాలా ఏళ్ల క్రితం తెలుగు సినిమాలో ఉత్సవాలు జరిగినప్పుడు ఊర్వశిని టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సినిమాల కోసం కాంటాక్ట్ చేశారు అనే టాక్‌ను స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసింది.
ఇదే కాదు తనతో ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసిన అగ్ర హీరోల గురించి తరచుగా ఏదో ఒక మంచి విషయాలు చెబుతూ ఉంటుంది. ఇలా తరచూ మీడియాలో తన పేరు నానేలా చూసుకుంటుంది అని ఆమెపై విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు గుడి కామెంట్స్‌తో మరోసారి ఆమె పబ్లిసిటీ గిమ్మిక్ అని అంటున్నారు నెటిజన్లు.