Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Dear Uma Review in Telugu: డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!

Dear Uma Review in Telugu: డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 18, 2025 / 06:47 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Dear Uma Review in Telugu: డియర్ ఉమ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పృథ్వీ అంబర్ (Hero)
  • సుమయ రెడ్డి (Heroine)
  • కమల్ కామరాజు ,సప్తగిరి,అజయ్ ఘోష్,ఆమని,రాజీవ్ కనకాల,పృథ్వీరాజ్ (Cast)
  • సాయి రాజేష్ మహాదేవ్ (Director)
  • సుమయ రెడ్డి (Producer)
  • రధన్ (Music)
  • రాజ్ తోట (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 18, 2025
  • సుమ చిత్ర ఆర్ట్స్ (Banner)

ఒక తెలుగమ్మాయి హీరోయిన్ గా నిలదొక్కుకోవడమే కష్టమవుతున్న ఈ తరుణంలో.. అనంతపూర్ నుంచి వచ్చిన సుమయ రెడ్డి పరిచయ చిత్రంతోనే నటిగా, నిర్మాతగా, రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హాస్పిటల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? సుమయ రెడ్డి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతుందా? అనేది చూద్దాం..!!

Dear Uma Review

కథ: పెద్ద రాక్ స్టార్ అవ్వాలనుకునే తపన ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాక రోడ్ల వెంబడి తిరుగుతుంటాడు దేవ్ (పృథ్వీ అంబార్), అందరి చేత “గెటవుట్” అనిపించుకునే దేవ్ ను మొదటిసారి ఉమ (సుమయ) “వెల్కం” చెబుతుంది. దాంతో ఆమెను అభిమానించి, ప్రేమించడం మొదలెడతాడు దేవ్. కట్ చేస్తే.. దేవ్ కి ఉమ గురించి ఊహించని నిజం తెలుస్తుంది.

అసలు ఉమ ఎవరు? దేవ్ & ఉమకి ఉన్న సంబంధం ఏమిటి? ఉమకి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “డియర్ ఉమ” చిత్రం.

నటీనటుల పనితీరు: కన్నడ నటుడు పృథ్వీ అంబర్ కి ఇది మొదటి తెలుగు సినిమా అయినప్పటికీ.. లిప్ సింక్ విషయంలో ఎక్కడా తడబడలేదు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగోకపోయినప్పటికీ.. పృథ్వీ మాత్రం పూర్తి న్యాయం చేశాడు.

సుమయ రెడ్డి స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. ఆమె పాత్రను మిస్టీరియస్ గా డీల్ చేసిన విధానం బాగున్నప్పటికీ, క్యారెక్టర్ ఆర్క్ ను క్లారిటీగా రాసుకుని ఉంటే ఆసక్తిగా ఉండేది.

కమల్ కామరాజు క్యారెక్టర్ సినిమాకి మెయిన్ సర్ప్రైజ్. ఆ పాత్ర వేరియేషన్స్ కానీ, కమల్ నటన కానీ కథ గమనానికి తోడ్పడ్డాయి.

సప్తగిరి కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు, అజయ్ ఘోష్ విలనిజం పండే ఆస్కారం ఉన్నా పెద్దగా వాడుకోలేదు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి నిజంగా రధన్ మ్యూజిక్ ఇచ్చాడా అనిపిస్తుంది. చాలా చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ కనీస స్థాయిలో కూడా లేదు. ఇక హీరో తాను సింగర్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం పాడే పాటలు మరి కాపీ రైట్స్ వలనో లేక మిక్సింగ్ కి టైమ్ లేకనో తెలియదు కానీ.. హీరో రఫ్ ట్రాక్స్ ఉంచేశారు. అవి చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఒక్క రెయిన్ ఫైట్ తప్ప చెప్పుకోదగ్గ ఫ్రేమ్ కానీ, సీన్ కానీ ఏదీ లేదు. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి.

సుమయ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఆమె లేవనెత్తిన ప్రశ్న కూడా ప్రశంసనీయమే. అయితే.. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ కథనంతో ఆసక్తి క్రియేట్ చేయడంలో తడబడ్డాడు. ఉమ పాత్ర ట్విస్ట్ & కమల్ కామరాజు క్యారెక్టర్ ట్విస్టులు బాగానే వర్కవుట్ అయినప్పటికీ.. డ్రామాని ఆసక్తికరంగా నడపడంలో మాత్రం విఫలమయ్యాడు.

విశ్లేషణ: రాసుకున్న కోర్ పాయింట్ తోపాటు, ఆ పాయింట్ ను నడిపించే కథనం కూడా బాగుండాలి. అప్పుడే సినిమా పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటుంది. లేదంటే బలప్రయత్నంగా మిగిలిపోతుంది. “డియర్ ఉమ” పరిస్థితి కూడా ఇంతే. అయితే.. ఎవరో అవకాశం ఇవ్వాలి అంటూ వెయిట్ చేయకుండా, తన అవకాశాన్ని తానే సృష్టించుకున్న సుమయ రెడ్డి ప్రయత్నాన్ని మాత్రం అభినందించాల్సిందే. అలాగే.. ఈ సినిమా ద్వారా లేవనెత్తిన “ఆపరేషన్ గదిలో ఒక్క బంధువైనా ఉండాలి” అనే కీలకమైన పాయింట్ మాత్రం కచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది.

ఫోకస్ పాయింట్: పాయింట్ బాగుంది కానీ.. ఎగ్జిక్యూషన్ గాడి తప్పింది!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dear uma
  • #Pruthvi Ambaar
  • #Sai Rajesh Mahadev
  • #Sumaya Reddy

Reviews

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

AR Murugadoss: 25 ఏళ్ల కల.. హీరోగా కోతి.. మురుగదాస్ క్రేజీ కథ

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

trending news

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే 12 సినిమాలు విడుదల

36 mins ago
2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

2025 Rewind: వెంకటేష్, పవన్ కళ్యాణ్ టు ఆది… ఈ ఏడాది ప్లాపుల నుండి బయటపడ్డ హీరోలు!

1 hour ago
Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

3 hours ago
Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

Raghu Glimpse: విభిన్న ప్రేమకథా చిత్రం ‘రఘు’ నుండి గ్లిమ్ప్స్ విడుదల

17 hours ago
Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

Rahman: మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చి.. ఆస్కార్ విన్నర్ కొత్త అవతారం?

23 hours ago
The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

The Raja Saab: మారుతి స్క్రీన్ ప్లే ప్లాన్ ఎలా ఉందంటే..

24 hours ago
Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

Anil Ravipudi: హీరో అవ్వమంటే అనిల్ ఇచ్చిన ఆన్సర్ ఇదీ

24 hours ago
“సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

“సఃకుటుంబానాం” చిత్ర ప్రివ్యూ చూసిన ప్రేక్షకుల మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : హీరో రామ్ కిరణ్

1 day ago
జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్

జనవరి 1న విడుదల అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సఃకుటుంబానాం” – ఫ్యామిలీస్ తో ప్రీమియర్స్ సక్సెస్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version