వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన హరీష్, తన అభిమానాన్ని అంతా కలగలిపి ఫ్యాన్స్ కి మంచి మాస్ మూవీ ఇచ్చాడు. అయితే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి 13 ఏళ్ళ తరువాత మళ్లీ పవన్-హరీష్ కాంబో సెట్ అవ్వటంతో ఫ్యాన్స్ లో కోలాహలం నెలకొంది.
రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ మధ్యనే ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్షన్లో ‘OG’ మూవీ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మ్యూజిక్ తో థమన్ చేసిన హడావిడి అంత ఇంత కాదు. గ్యాప్ దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
దాంట్లో పవన్ కళ్యాణ్ మునుపటి స్వాగ్, స్టైల్ కనపడ్తుందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. డిసెంబర్ లో మొదటి సింగల్ రిలీజ్ చేయటానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.