UV Creations: ఏక్ మినీ కథ.. ఇంకా అయిపోలేదు

ప్రభాస్ మిర్చి సినిమాతో ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన యూవీ క్రియేషన్స్ మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. నిజానికి వారు తెలివిగా సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబడుతున్నాయి. కేవలం పెద్ద సినిమాలే కాకుండా చిన్న హీరోలతో చేస్తున్న సినిమాలు కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇక సాహో అనంతరం ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాను రెడీ చేస్తున్న వీరు మరోవైపు గోపిచంద్ – మారుతి కాంబినేషన్లో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్నారు.

అయితే యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ లో పూర్తిగా భిన్నమైన మినీ సినిమాలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్ మినీ కథ మొత్తానికి ఓటీటీ లో సక్సెస్ టాక్ ను అందుకుంది. అయితే యూవీ కాన్సెప్ట్స్ బోల్డ్ కంటెంట్ లు ఇంతటితో అయిపోలేదట. మరొక బోల్డ్ స్టోరీ కూడా రెడీ అవుతున్నట్లు సమాచారం. అలాగే ప్రభాస్ సపోర్ట్ తోనే హీరో సంతోష్ శోభన్ కు యూవీ కాన్సెప్ట్ లో ఒక హిట్టిచ్చారు. మరొక సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నారు.

యూవీ కాన్సెప్ట్స్ సినిమాలు నెవర్ బిఫోర్ అనేలా ఉండాలని యూవీ నిర్మాతలు నేటితరం యంగ్ డైరెక్టర్స్ కు అవకశాలు కూడా ఎక్కువగానే ఇవ్వాలని అనుకుంటున్నారు. అవసరం అయితే మారుతి వంటి దర్శకుల నుంచి కథలు రాయించేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి ముందుముందు ఇంకా ఎలాంటి షాక్ లు ఇస్తారో చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus