సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ఉరేసుకుని ప్రాణం తీసుకున్న నటి..!

సినీ ఇండస్ట్రీలో మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గత 3 నెలల్లో దాదాపు 50 మందికి పైనే మరణించారు. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు, దర్శకులు, మేకప్ ఆర్టిస్ట్ లు, పర్సనల్ మేనేజర్ లు, ఫ్యాషన్ డిజైనర్లు, .. లేదంటే నటీనటుల కుటుంబ సభ్యులు ఇలా ఎవరోకరు మరణిస్తూనే ఉన్నారు. బుల్లితెర ఆర్టిస్ట్ లు కూడా కొంతమంది మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ సీరియల్ నటి ఆత్మహత్య చేసుకుని మరణించడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. హిందీలో పలు సీరియల్స్ తో పాపులర్ అయ్యింది వైశాలి టక్కర్.

అయితే ఈమె సూసైడ్ చేసుకుని చనిపోవడం బాలీవుడ్ కు పెద్ద షాకిచ్చినట్టు అయ్యింది. ఇండోర్ లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోయి ఉంది.దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ వీరికి ఓ సూసైడ్ నోట్ లభించిందట.ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ వేధింపుల కారణంగానే ఆమె ఇలా ప్రాణాలు తీసుకున్నట్టు అందులో ఉందట. ఆమె మరణానికి ముందు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసిందట. ఇందులో తన బాయ్ ఫ్రెండ్ వల్ల మోసపోయినట్టు ఆమె తెలిపింది.

డబుల్ గేమ్ ఆడి ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. 2016 లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సూపర్ సిస్టర్స్, యే రిక్తా క్యా కేల్తా హై, యహ్ వదా రహా, యే హై ఆషికీ బృందా వంటి సీరియల్స్ లో నటించింది. ఈమె వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే కావడం అందరినీ బాధపెట్టే అంశం. ఇదిలా ఉండగా … వైశాలి చనిపోయే ముందు ఇన్స్తా లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus