Vaishnav Tej: వైరల్‌ పిక్‌: అభిమాన నటి గురించి వైష్ణవ్‌ ఏమన్నాడంట

వైష్ణవ్‌తేజ్‌ అభిమాన కథానాయిక ఎవరు అంటే… ‘సోనాక్షీ సిన్హా’ అని ఠక్కున చెప్పేస్తారు మన తెలుగు సినిమా ప్రేక్షకులు. అంతగా ఆమె గురించి ఆ మధ్య ‘ఉప్పెన’ ప్రమోషన్స్‌లో చెప్పాడు వైష్ణవ్‌. అయితే ఆమెను ఎంతగా ఇష్టపడుతున్నాడు అనేది మాత్రం ఇటీవల చెప్పుకొచ్చాడు. ఆమె ఫొటోను తన మొబైల్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడట. అంతేకాదు… ఓసారి ఆమెను కలసినప్పుడు చూపించాడు కూడా అట. ‘దబంగ్‌’ సినిమా వచ్చినప్పటి నుండి సోనాక్షీ అంటే వైష్ణవ్‌కు ఇష్టమట.

అంతేకాదు అంతలా ఎందుకు ఇష్టపడుతున్నాడో కూడా చెప్పలేడట. ‘భుజ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో కెమెరామెన్‌ సాయంతో సోనాక్షీని కలిశాడట వైష్ణవ్‌. ఆ సందర్భంగా సెల్ఫీ కోసం మొబైల్‌ తీస్తే… అందులో తన ఫొటో ఉండటం సోనాక్షీ చూసిందట. ఆ సమయంలో వైష్ణవ్‌ ‘ఉప్పెన’లో నటిస్తున్నానని చెప్పాడట. ఆ మాట సోనాక్షి ఇచ్చిన సమాధానంతో వైష్ణవ్‌ చాలా ఆనందపడ్డాడట. కారణం ఆమె చెప్పిన మాట. ‘నువ్వు యాక్టర్‌ అయ్యాక. ఆ విషయం నాకు తెలిస్తే…

ఇప్పుడు తీసిన ఫొటో నా ట్విటర్‌లో ట్వీట్‌ చేస్తా’ అని చెప్పిందట. ఈ సంఘటన 2020 జులై 20న జరిగింది. ఆ తర్వాత వైష్ణవ్‌ హీరో అయ్యాడు. రెండు సినిమాలు చేశాడు. మరి ఈ విషయంలో ఇంకా ఆమె దగ్గరకు చేరలేదేమో. లేదంటే ఈ పాటికే ట్వీట్‌ వచ్చి ఉండేది కదా.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus