Vaishnav Tej: అలాంటి కథల వల్ల సినిమాని చూసే తీరు మారింది..!

‘ ఉప్పెన ‘ తర్వాత వైష్ణవ్ తేజ్ నుండీ రాబోతున్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ కొండపొలం’ అనే కథ చాలా కొత్తది. నేను ఎప్పుడూ అలాంటి కథ వినలేదు. క్రిష్ గారి గమ్యం,వేదం వంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. ఆయన మేకింగ్ చాలా బాగుంటుంది.ఈసారి కూడా ఓ కొత్త పాయింట్ చెప్పాలని అనుకున్నారు. అందుకే ఈ కథను నాతో చేశారు. కొండపొలం సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయి.అలాగే మంచి సందేశాత్మక చిత్రం కూడా. రంగస్థలం నుంచి అందరూ సినిమాను చూసే కోణం మారిపోయింది.అలాగే ఇందులో ప్రతీ ఒక్క ఎమోషన్ ఉంటుంది.ఉప్పెనలో ఫిషర్ మ్యాన్ పాత్రను చేశాను. దానికి తగ్గట్టుగానే నా మేకోవర్ ఉంటుంది. ఇక ఇందులోనూ అంతే రగ్డ్ లుక్‌లో కనిపిస్తాను. నా మూడో సినిమా కమర్షియల్ లవ్ స్టోరీ గా ఉంటుంది. అందులో నా లుక్ వేరేలా ఉంటుంది.

పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్ అన్న అలా కొడుతున్నాడు.. నాక్కూడా కొట్టాలనిపిస్తుంది. మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో నాకు కొత్త కథలు ఎంచుకోవాలనిపిస్తుంది.’ రిపబ్లిక్ ‘ మూవీలో అన్నయ్య ఐఏఎస్, నేను ఇందులో ఐఎఫ్ఎస్. కానీ రిపబ్లిక్, కొండపొలం ఒకదానికొకటి సంబంధం ఉండదు. అన్నయ్య (సాయి ధరమ్ తేజ్) బాగున్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పుడు ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లనే బయటకు వస్తారు.

మా మామయ్యలు, అన్నయ్యకు ఇమేజ్ రావడం నేను చూశాను. కానీ నాకు ఇలా వస్తుందని, ఇలా వస్తే ఎలా ఉండాలో కూడా ఆలోచించలేదు. ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అంద‌రూ న‌న్ను చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది (నవ్వుతూ).ఓటీటీ ప్రాజెక్టులు… ఆఫర్లు ఏమి రాలేదు.వస్తే తప్పకుండా న‌టిస్తాను. ప్రస్తుతానికి అయితే గిరిసయ్య (తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడు) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాను.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus