Vaishnav Tej: ఇంటర్వ్యూ: ఆదికేశవ గురించి వైష్ణవ్ తేజ్ చెప్పిన ఆసక్తికర విషయాలు.!

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, స్టార్ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందిన మూవీ ‘ఆదికేశవ’. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’, ‘ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌’ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘శ్రీకర స్టూడియోస్’ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నవంబర్ 24 న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అవి మీకోసం :

ప్ర) ఆదికేశవ జర్నీ ఎలా మొదలైంది?

వైష్ణవ్ తేజ్ : రంగ రంగ వైభవంగా షూటింగ్ దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగ వంశీ గారు ఈ కథ వినమని నాకు చెప్పారు. కథ వినగానే నాకు బాగా నచ్చింది. ట్రైలర్ చూస్తున్నప్పుడు మీకు రోటీన్ అనే ఫీలింగ్ కలగవచ్చు, కానీ ఆ ఒపీనియన్ ని బ్రేక్ చేస్తూనే కథ ముందుకు వెళుతుంది. చివర్లో ఆ ట్విస్ట్ కూడా సంతృప్తి కలిగిస్తుంది.

ప్ర) ఒక క్లాస్ మూవీ తీసాక… రెండు, మూడు హిట్లు కొట్టి తర్వాత మాస్ సినిమా చేయాలని యంగ్ హీరోలు అనుకుంటారు? కానీ మీ ఫ్యామిలీకి మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి మాస్ సినిమా వెంటనే చేసేసారా?

వైష్ణవ్ తేజ్ : అలాంటి ఉద్దేశం లేదు. కథ నచ్చి చేశాను. నాకు తెలిసిందల్లా కష్టపడి నిజాయితీగా పని చేయడమే.. ఫలితం గురించి ఆలోచించి ఏదీ చేయను. నా మొదటి సినిమా ఉప్పెన కూడా అలాగే చేశాను. నాకు ముందు కథ నచ్చాలి. ఎవరైనా అడిగినా కూడా నేను హీరోని కాదు, నటుడిని అనే చెబుతాను. పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో, నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుందని అంటారు.

ప్ర) ఈ కథలో మీకు నచ్చిన అంశం ఏంటి?

వైష్ణవ్ తేజ్ : ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ గ్రాండ్ గా ఉంటాయి. ఎక్కడా కూడా విసిగించదు.

ప్ర) ఫైట్ సీన్స్ కొంచెం మీ ఇమేజ్ ని మించి ఉంటాయి అనిపిస్తుంది.. నిజమేనా?

వైష్ణవ్ తేజ్ : యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. అవి నేచురల్ గానే ఉంటాయి. కొడితే పది మంది గాల్లో ఎగరడం లాంటివి ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. కానీ కొంచెమైనా హై ఉండాలి కాబట్టి… కనీసం కొంచెం దూరం వెళ్లి పడతారు అంతే..!

ప్ర) శ్రీలీలతో డ్యాన్స్ చేయడం ఎలా అనిపించింది?

వైష్ణవ్ తేజ్ : నాకు డ్యాన్స్ రాదు (నవ్వుతూ). కానీ నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనే వరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను అన్నాను. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమయ్యేది. మాస్టర్, శ్రీలీల మద్దతుతో న్యాయం చేయగలిగాను అని అనుకుంటున్నాను

ప్ర) ఆదికేశవ కథలో టైటిల్ కి తగ్గట్టు దైవత్వము లాంటిది ఉంటుందా?

వైష్ణవ్ తేజ్ : ఓ 10 శాతం అలా శివుడి గురించి ఉంటుంది. అది కథలో భాగమై ఉంటుంది.

ప్ర) యంగ్ హీరోలు మాస్ సినిమాలు చేయాలి అనుకుంటే స్టార్ డైరెక్టర్లతో చేయాలి అనుకుంటారు. లేదంటే రిస్క్ అంటారు. మీరేమో కొత్త దర్శకుడు శ్రీకాంత్ తో చేశారు. రిస్క్ అనిపించలేదా?

వైష్ణవ్ తేజ్ : కథ చెప్పినప్పుడు నాకు ఎంత బాగుంది అనిపించిందో.. దానిని అంతే అద్భుతంగా ఆయన తెరకెక్కించారు. సినిమా మీరు చూస్తున్నప్పుడు తెలుస్తుంది.

ప్ర) జోజు జార్జ్ గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?

వైష్ణవ్ తేజ్ : జోజు జార్జ్ గారు చాలా స్వీట్ పర్సన్. ఆయనతో సెట్స్ లో ఉన్నప్పుడు విజయ్ సేతుపతి గారిని చూసినట్లే అనిపించేది. ఆయన భోజన ప్రియుడు. ఫలానా చోట ఫుడ్ బాగుంటుంది అంట కదా అని అడిగేవారు. అంత పెద్ద యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అయినప్పటికీ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్.

ప్ర) శ్రీలీలతో మీ సన్నివేశాలు ఎలా ఉంటాయి?

వైష్ణవ్ తేజ్ : నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా అనిపిస్తాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం.

ప్ర) సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ మ్యూజిక్ గురించి చెప్పండి?

వైష్ణవ్ తేజ్ : జి.వి. ప్రకాష్ గారితో పని చేయడం చాలా హ్యాపీ. ఆయన మెలోడీ అయినా, మాస్ బీట్ అయినా ఏదైనా సూపర్ గా ఇస్తారు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా వచ్చింది. ఆయన చాలా స్వీట్ పర్సన్. ఎప్పుడూ పని గురించే మాట్లాడుతూ ఉంటారు.

ప్ర) మీ గత సినిమా ఆడలేదు, దానిని దృష్టిలో పెట్టుకుని కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

వైష్ణవ్ తేజ్ : ఖచ్చితంగా కథలో కొత్తదనం ఉండాలి. అలాగే పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటున్నాను. ఈ తరానికి నచ్చేలా ఉండాలి.

ప్ర) మీ అన్నయ్య( సాయి తేజ్) కి సినిమా చూపించారా?

వైష్ణవ్ తేజ్ : లేదు, మా అమ్మ, అన్నయ్య .. ఆడియన్స్ తో కలిసి ధియోటర్స్..లోనే చూస్తారు.

ప్ర) మీరు (ఆది)కేశవ, మీ అన్నయ్య (గంజా)శంకర్.. రెండూ కూడా శివుడి రిఫరెన్స్ లు , పైగా సేమ్ బ్యానర్లో చేస్తున్నారు? ఎలా అనిపిస్తుంది.

వైష్ణవ్ తేజ్ : కో ఇన్సిడెన్స్ అంతే..! బట్ హ్యాపీగా అనిపిస్తుంది.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

వైష్ణవ్ తేజ్ : అన్నపూర్ణ బ్యానర్లో ఒక సినిమా ఉంది. మిగిలినవి చెబుతాను.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus