Vaishnav Tej: పవన్ మామయ్య నాకు అదొక్కటే చెప్పారు!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆది కేశవ. ఈ సినిమా నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ లీల వైష్ణవ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వైష్ణవ్ సినిమా గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ… తాను ఆదికేశవ సినిమా ద్వారా మాస్ హీరో అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సినిమా ఏ మాత్రం చేయలేదని తెలియజేశారు. ఇకపోతే తనని ఎవరైనా హీరో అంటే కూడా నాకు ఇష్టం ఉండదని తాను అసలు హీరోనే కాదని ఒక నటుడిని మాత్రమే అంటూ ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ తెలిపారు. తనకు చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారని ఈయన ఈ సందర్భంగా తెలిపారు.

ఒక వ్యక్తి హీరో అనిపించుకోవడం కన్నా నటుడు అనిపించుకుంటేనే తనకి విభిన్న పాత్రలలో నటించే అవకాశం లభిస్తుందని పవన్ కళ్యాణ్ తనకు చెప్పారు అంటూ ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ వెల్లడించారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ తాను రంగా రంగా వైభవంగా సినిమా చేస్తున్న సమయంలోనే నాగ వంశి గారు నాకు ఆదికేశవ సినిమా కథ వినమని చెప్పారు. ఇలా ఈ సినిమా కథ వినగానే తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.

ఈ సినిమా కథ విన్న తర్వాత ఈ సినిమాకు ఎన్నో మెరుగులు దిద్దారని సినిమా అద్భుతంగా వచ్చింది. ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుందన్నారు. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదని అనిపించిందని.. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయని ఈ సందర్భంగా (Vaishnav Tej) వైష్ణవ్ తెలిపారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus