Vaishnavi Chaitanya: ఇది నిజమేనా అంటున్న బిగ్ బాస్ అభిమానులు..!

తెలుగు బుల్లితెరపై త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 హడావిడి చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కింగ్ నాగార్జున కు సంబంధించి విడుదలైన ఒక ప్రోమో బిగ్ బాస్ పై ఆసక్తిని రేపుతోంది. అయితే ఎంతో సాధారణంగా విడుదలైన ఈ ప్రోమో తర్వాత కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎందరో సెలబ్రిటీల పేర్లు ఈ జాబితాలో చేర్చి వారు బిగ్ బాస్ లో సభ్యులు అని కొందరు నటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంకా లిస్టు ఫైనల్ కాలేదు కాబట్టి పూర్తి వివరాలు పై ఎవరికీ క్లారిటీ లేదు.

తెలుగులో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు, ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ గా వచ్చారు. ఇక అక్కడి నుంచి నాగార్జున అన్ని సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ హోస్ట్ నాగార్జున డిఫరెంట్ లుక్ తో స్టైలిష్ గడ్డంతో దేవదాస్ లా ఉన్న బిగ్ బాస్ సీజన్ 7 కి ప్రోమో కూడా విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఈ షో కి సంబంధించి మరొక తాజా వార్త నెట్ లో హల్చల్ చేస్తోంది.బిగ్ బాస్ సీజన్ 6 కంప్లీట్ అయ్యి చాలా టైం అవుతున్నా బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి ఎటువంటి వార్త లేకపోవడంతో అసలు ఈసారి బిగ్ బాస్ ఉందా లేదా అని అభిమానులు తెగ బాధపడ్డారు. సీజన్ 6 సరిగ్గా ప్రజాధరణ పొందకపోవడంతో ఇక నెక్స్ట్ సీజన్ ఉండదు అన్న రూమర్ కూడా బాగా స్ప్రెడ్ అయింది.

ఈ నేపథ్యంలో విడుదలైన కొత్త ప్రోమో బిగ్ బాస్ ఫ్యాన్స్ కి కాస్త ఊరట కలిగించింది. దీనికి తోడు ఇంతకుముందు సీజన్లో రిపీట్ అయిన మిస్టేక్స్ మళ్లీ రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ షోని నిర్వహించినట్లు మేకర్స్ ప్రకటించడం కూడా జరిగింది.గెస్ట్లుగా వచ్చే వారి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబర్స్ ,కొరియోగ్రాఫర్, సీరియల్ నటులను ఇలా మంచి సెలబ్రిటీలను సెలెక్ట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ లిస్ట్ ఇంకా ప్రకటించలేదు. లిస్టులో ఉన్న పేర్లు రివిల్ అయ్యే లోపే కొంతమంది సెలబ్రిటీల పేర్లను ముందుగానే నటిజెన్లు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం బేబీ మూవీ తో బాగా పాపులర్ అయిన వైష్ణవి కూడా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని పెద్ద టాక్ నడుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై ఎటువంటి అధికారిక స్పష్టత లేదు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus