Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ ను ఇబ్బంది పెడుతున్న ప్రొడ్యూసర్..!

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో వైష్ణవ్ కి వరుస అవకాశాలు వచ్చాయి. రీసెంట్ గా ‘కొండపొలం’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో మూడో నటిస్తున్నారు. దీన్ని బాపినీడు నిర్మిస్తున్నారు. అయితే ఇదే బ్యానర్ లో అన్నపూర్ణ స్టూడియోస్ కాంబినేషన్ లో మరో సినిమా ప్లానింగ్ లో ఉంది. ఇలాంటి సమయంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, దర్శకుడు త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ తో కలిపి వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది.

ఈ విషయంలో వైష్ణవ్ తేజ్ కి, నిర్మాత బాపినీడుకి మధ్య గొడవ మొదలైందట. వైష్ణవ్ నాల్గో సినిమా కూడా తమ బ్యానర్ లోనే చేయాలని నిర్మాత బాపినీడు పట్టుపడుతున్నారట. ఈ విషయం వైష్ణవ్ తేజ్ కి నచ్చడం లేదు. తాను మరో సినిమా చేస్తా అన్నాను కానీ.. అది నాల్గోదా..? లేక ఐదోదా..? అనే కమిట్మెంట్ ఇవ్వలేదని.. ఎక్కడా అగ్రిమెంట్ మీద సంతకం చేయలేదని వైష్ణవ్ తేజ్ నిర్మాత బాపినీడుకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై మల్లగుల్లాలు నడిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఆగిపోయింది. అనివార్య కారణాల వలన టైటిల్ అనౌన్స్మెంట్ వాయిదా వేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత తీరుతో వైష్ణవ్ తేజ్ విసిగిపోయాడని టాక్. మరి ఈ విషయాన్ని ఎలా సెటిల్ చేసుకుంటారో చూడాలి. వైష్ణవ్ మాత్రం సితార బ్యానర్ లో తన నెక్స్ట్ సినిమా చేయాలని అయ్యారు. అలా చూసుకుంటే బాపినీడు కాంప్రమైజ్ అవ్వకతప్పదు. ఆయన కూడా పట్టుబడితే మాత్రం కష్టమే..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus