3 ఏళ్ళ తరువాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నుండీ వచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసాడు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, బోణి కపూర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శృతీ హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగెళ్ళ వంటి భామలు కూడా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ లభించింది.
దాంతో ఫస్ట్ వీకెండ్ ను ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి.వాటి వివరాలను ఓ సారి పరిశీలిస్తే :
నైజాం | 16.00 cr |
సీడెడ్ | 8.25 cr |
ఉత్తరాంధ్ర | 7.70 cr |
ఈస్ట్ | 4.30 cr |
వెస్ట్ | 5.70 cr |
గుంటూరు | 4.85 cr |
కృష్ణా | 3.25 cr |
నెల్లూరు | 2.40 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 52.45 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.40 cr |
ఓవర్సీస్ | 3.20 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 58.05 cr |
వకీల్ సాబ్’ చిత్రానికి 89.85కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 90.5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాలి.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 58.05 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 32.45 కోట్ల షేర్ ను రాబట్టాలి. మంగళవారం అలాగే బుధవారం సెలవులు ఉన్నాయి.. ఆ పైన వీకెండ్ కూడా ఉండడంతో ‘వకీల్ సాబ్’ కు బాగా కలిసొచ్చే అంశం.
Click Here To Read Movie Review
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!