టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా సెట్స్ పైకి రాకముందే బిజినెస్ డీల్స్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతుండడం సహజం. అయితే షూటింగ్ ముగిస్తే మాత్రం డీజిటల్ ఓటీటీ , శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా సినిమాలు భారీ స్థాయిలో లాభాలు అందుకుంటున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ కు సంబంధించిన హక్కులపై కూడా అనేక రకాల గాసిప్స్ పూట్టుకొస్తున్నాయి.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా పింక్ సినిమాకి రీమేక్ అని అందరికి తెలిసిన విషయమే. దిల్ రాజు, బోణి కపూర్ తెలుగులో సంయుక్తంగా నిర్మించారు. అయితే ఒక రీమేక్ సినిమాకు ఎవరు ఊహించని రేంజ్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు టాక్ వస్తోంది. ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ అందుకోగా.. శాటిలైట్ హక్కులను జీ తెలుగు అందుకుంది.
ఇక వాళ్ళ డీలింగ్స్ ఎలా కొనసాగయో తెలియదు గాని సినిమా డిజిటల్, శాటిలైట్. హక్కుల ద్వారా మొత్తంగా 50కోట్ల రూపాయల వరకు లాభాలను అందించినట్లు సమాచారం. అంటే దాదాపు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ తో సమానమని మరొక టాక్ కూడా వైరల్ గా మారింది. చూస్తుంటే పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. గత సినిమాల ప్రభావం కూడా ఏమి కనిపించడం లేదు. ఇక సినిమా ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రేర్ ఫోటో గ్యాలరీ!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!