‘వకీల్ సాబ్’ టీజర్ ఆ విషయంలో నిరాశపరిచిందే..!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. నిజానికి గతేడాది సమ్మర్ కే ఈ చిత్రం విడుదలవ్వాలి.. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల విడుదల కాలేదు. షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అవ్వకపోవడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు.దీంతో ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ కు విడుదల చెయ్యాలని నిర్మాతలు దిల్ రాజు,బోణి కపూర్ లు భావిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదలయ్యింది. ఇందులో పవన్ లుక్స్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. అయితే పవన్ సినిమాల టీజర్లు ఎలా ఉన్నా.. వాటిని ట్రేండింగ్లో నిలబెట్టడానికి పవన్ అభిమానులు చాలా కృషి చేస్తుంటారు. అయితే ఈసారి ఆ ఊపు కనిపించలేదు. ‘వకీల్ సాబ్’ టీజర్ విడుదలైన 24గంటల్లోనే 1మిలియన్ లైక్స్ ను సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ టీజర్ విడుదలై 3 రోజులు కావస్తున్నా ఆ ఫీట్ ను అందుకోలేకపోయాడు ‘వకీల్ సాబ్’.సంక్రాంతి టైములో విడుదలవ్వడం వలనే.. ఆ ఫీట్ సాధ్యం కాలేదు అన్నది కొందరి అభిప్రాయం.

అభిమానులంతా పండుగ సందర్భంగా కుటుంబాలతోనూ అలాగే జాతరల్లోనూ తిరుగుతూ ఉండడం వల్లే ‘వకీల్ సాబ్’ టీజర్ ను పట్టించుకోలేదు అని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఇది రీమేక్(‘పింక్’) సినిమా అవ్వడం కూడా ఓ కారణమని వారు చెబుతున్నారు. అయితే టీజర్ విడుదలై 3 రోజులు కావస్తున్నా.. ఇంకా ట్రెండింగ్ నెంబర్ 1 గానే కొనసాగుతుండడాన్ని కూడా వారు గుర్తుచేసుకుంటే బెటరేమో..!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus