Vakkantham Vamsi: టెంపర్ రెమ్యునరేషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన వక్కంతం.. ఏమన్నారంటే?

  • December 11, 2023 / 12:53 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న వక్కంతం వంశీ స్టార్ డైరెక్టర్ గా మాత్రం గుర్తింపును సొంతం చేసుకునే విషయంలో ఫెయిలవుతున్నారు. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కూడా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. అయితే టెంపర్ సినిమా వివాదం విషయంలో వక్కంతం వంశీ గతంలో కోర్టును ఆశ్రయించారు.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కూడా అంచనాలను అందుకోకపోవడంతో వక్కంతం వంశీకి ఛాన్స్ ఎవరిస్తారా అనే చర్చ జరుగుతోంది. టెంపర్ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ అందలేదని కోర్టును ఆశ్రయించడం గురించి వక్కంతం స్పందిస్తూ టెంపర్ సినిమా రిలీజ్ సమయంలో బండ్ల గణేష్ చెక్కు ఇచ్చారని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ చెక్ బౌన్స్ అయిందని కామెంట్లు చేశారు.

అప్పటికే టెంపర్ రిలీజ్ కావడంతో ఏం చేయలేకపోయానని ఆ సమయంలో ఎవర్ని కలవాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బండ్ల గణేష్ ఏ ఇబ్బంది ఉందో తనకు తెలియదని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదని ఆయన తెలిపారు. ఆ సమయంలో కోర్టుకు వెళ్లి పలుమార్లు కోర్టు చుట్టూ తిరిగానని వక్కంతం వంశీ అన్నారు.

ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దమనిషి చెప్పడంతో బండ్ల గణేష్ డబ్బులు సెటిల్ చేశారని బండ్ల గణేష్ పై నాకు కోపం లేదని మోసం చేశాడనే బాధ మాత్రం ఉందని వక్కంతం వంశీ పేర్కొన్నారు. వక్కంతం వంశీ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. వక్కంతం వంశీ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus