Vakkantham Vamsi: ‘నా పేరు సూర్య’ ఎఫెక్ట్‌ నుండి బయటపడ్డారా!

  • April 5, 2022 / 04:28 PM IST

ఎన్నో కమర్షియల్‌ హిట్‌ సినిమాలకు కథ అందించిన రచయిత ఆయన… అలాంటి వ్యక్తి నుండి దర్శకుడిగా తొలి సినిమా అనేసరికి అంచనాలు ఏ రేంజిలో ఉంటాయి. అందులోనూ దేశాభిమానం, గౌరవం మీద సినిమా అనేసరికి అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే సినిమా వచ్చాక పరిస్థితి అమాంతం మారిపోయింది. సినిమా బాక్సాఫీసు దగ్గర బొక్క బోర్లాపడింది. సినిమా కథ రాసేటంత ఈజీ కాదు, దర్శకత్వం అంటే అంటూ కామెంట్లు కూడా వినిపించాయి. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా అని.

అవును, మీరు అనుకుంటున్నది నిజమే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ దర్శకుడు వక్కంతం వంశీ గురించే ఇదంతా. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా రూపొందిన ఆ సినిమా పరాజయం అతన్ని ఎంతగా కలచివేసిందో తెలియదు కానీ, వంశీ కెరీర్‌కు మాత్రం పెద్ద దెబ్బే. ఎంతగా అంటే కొత్త సినిమా మొదలవ్వడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టింది. నితిన్‌తో ఓ సినిమాను వంశీ డైరెక్ట్‌ చేస్తారని ఆ మధ్య పుకార్లొచ్చాయి. ఇటీవల కన్ఫామ్‌ అయ్యి ఓపెనింగ్‌ కూడా జరుపుకుంది. దీంతో ‘నా పేరు సూర్య’ ఘోర పరాజయ భారం నాలుగేళ్లకు దిగింది అని అంటున్నారు.

వక్కంతం వంశీ కెరీర్‌ గురించి చాలామందికి తెలిసిందే. న్యూస్‌ రీడర్‌ నుండి కథా రచయితగా ఎదిగారు. ఈ క్రమంలో చాలా అడ్డంకులు దాటే వచ్చి ఉంటారు. కానీ రచయిత నుండి దర్శకుడు అవ్వడానికి అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్‌తో సినిమా అంటూ రోజులు తరబడి వెయిట్‌ చేసి, ఆఖరికి ‘నా పేరు సూర్య’ అంటూ బన్నీ హీరోగా సినిమా చేశారు. అయితే తొలి సినిమా డిజాస్టర్ కావడంతో వక్కంతం వంశీ దర్శకత్వ ప్రయాణానికి బ్రేక్‌ పడింది.

దీంతో మెగాఫోన్‌ను పక్కనపెట్టేశాడు. కథా రచయితగా మాత్రం కొనసాగారు. అఖిల్‌తో సురేందర్‌ రెడ్డి చేస్తున్న ‘ఏజెంట్‌’కి కథ ఇచ్చింది వక్కంతం వంశీనే. అన్నట్లు పవన్‌ కల్యాణ్‌ – సురేందర్‌ రెడ్డి సినిమాకు వంశీనే కథ అందిస్తున్నాడు. అప్పుడెప్పుడో అనౌన్స్‌ అయిన ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus