Valimai Trailer: ‘వలిమై’ ట్రైలర్.. యాక్షన్ డోస్ మాములుగా లేదు!

కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ ‘వలిమై’ సినిమాతో జ‌న‌వ‌రి 13న సంక్రాంతి సందడి చేయడానికి రెడీ అయ్యారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందించారు. కోలీవుడ్ లోనే కాకుండా తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోలోనూ విడుద‌ల చేయాలనుకున్నారు. కానీ ఒమిక్రాన్ కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 24న సినిమా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

Click Here To Watch

దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా సినిమా తెలుగు ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సినిమాలో హీరో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. క్రైమ్ ఎలాంటిదైనా.. నిందితులను పట్టుకోవడంలో ముందుండే హీరోకి ఓ ముఠా కారణంగా సమస్యలు ఏర్పడతాయి. సొంత తల్లి కూడా చీదరించుకునే పరిస్థితి కలుగుతుంది. దీంతో హీరో ఆ ముఠాను ఎలాగైనా పట్టుకోవాలని యూనిఫామ్ పక్కన పెట్టి మరీ పోరాడతాడు.

చివరికి ముఠాను పట్టుకున్నాడా లేదా..? అనేదే సినిమా. ట్రైల‌ర్‌లో యాక్ష‌న్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. బైక్ స్టంట్స్ అదిరిపోయాయి. విలన్ క్యారెక్టర్ లో టాలీవుడ్ హీరో కార్తికేయ నటించడం విశేషం. హుమా ఎస్ ఖురేషి, బని, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, పుగజ్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

కె కధీర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus