Vamshi Paidipally: జూనియర్ ఎన్టీఆర్ ను అలా పిలుస్తా.. వంశీ పైడిపల్లి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిదానంగా సినిమాలు తీసినా తీసిన ప్రతి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు వంశీ పైడిపల్లి పేరు సమాధానంగా వినిపిస్తోంది. మహర్షి, వారసుడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ఈ దర్శకుని కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా పెళ్లికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారని అయితే ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే వచ్చాడని వంశీ పైడిపల్లి వెల్లడించారు.

నా పెళ్లి జరిగే సమయానికి నాకు, జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని బొమ్మరిల్లు 50 డేస్ ఫంక్షన్ సమయంలో మేము వేసిన టీజర్ తారక్ కు బాగా నచ్చిందని ఆ టీజర్ నచ్చి తారక్ నాకు ఫోన్ చేశారని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు. మున్నా టీజర్ ను నేను చూశానని టీజర్ నాకు ఎంతగానో నచ్చిందని తారక్ చెప్పాడని వంశీ పైడిపల్లి వెల్లడించారు. ఆ సమయంలో తారక్ తో నాకు కాంటాక్ట్ మొదలైందని వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) చెప్పుకొచ్చారు.

మున్నా రిలీజ్ కు ముందే నేను తారక్ ను కలవగా మా ఇద్దరి మధ్య స్నేహ బంధం ఏర్పడిందని వంశీ పైడిపల్లి అన్నారు. మున్నా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని ఆయన తెలిపారు. అందరితో పాటు తారక్ ను పెళ్లికి ఆహ్వానించానని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను అన్నయ్య అని పిలుస్తానని వంశీ పైడిపల్లి వెల్లడించారు.

యమదొంగ సినిమా చేస్తున్న సమయంలో తారక్ నా పెళ్లికి వచ్చి గంట కంటే ఎక్కువగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తారక్ నా పెళ్లికి వచ్చిన క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన అన్నారు. చిన్న చెల్లి పెళ్లి సమయానికి నేను బృందావనం సినిమాకు కమిట్ అయ్యానని వంశీ పైడిపల్లి వెల్లడించారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus