మహేష్ నో చెబితే.. మెగా ఫ్యామిలీ ఎస్ చెబుతుందేమిటబ్బా!!

ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ/దర్శకుడు మరో హీరో ఒకే చేయడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అనాదిగా అన్నీ ఇండస్ట్రీలు ఫాలో అవుతున్న పద్ధతే. అప్పట్లో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథలను శోభన్ బాబు ఒకే చేసేవారట. ఏయన్నారు రిజెక్ట్ చేసిన కథలు చంద్రమోహన్ దగ్గరికి రావడం షరా మామూలే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల విషయంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే.. మహేష్ & మెగా ఫ్యామిలీ హీరోల విషయంలో మాత్రం ఈ పద్ధతి కాస్త విచిత్రంగా జరుగుతుంది.

నిజానికి “మహర్షి” అనంతరం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి మహేష్.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొజెక్ట్ ను కన్ఫర్మ్ కూడా చేశారు. అయితే.. మహేష్-సుకుమార్ లకు వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ ప్రొజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది. అదే కథను ఇప్పుడు సుకుమార్ తన ఫేవరెట్ హీరో బన్నీతో “పుష్ప”గా తెరకెక్కిస్తున్నాడు. అలాగే.. “సరిలేరు నీకెవ్వరు” అనంతరం మళ్ళీ మహర్షి కాంబో రిపీట్ చేద్దామనుకున్నాడు మహేష్. వంశీ పైడిపల్లి ఈసారి మహేష్ ను ఒక మాఫియా డాన్ గా అల్ట్రా స్టైలిష్ గా రీప్రెజంట్ చేద్దామని డిసైడ్ అయిపోయాడు.

అయితే మళ్ళీ మహేష్ కి ఫైనల్ స్టోరీ నచ్చకపోవడంతో ఆ ప్రొజెక్ట్ కు బై చెప్పి పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట”ను మొదలెట్టేశాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లి మహేష్ కు చెప్పగా పట్టాలెక్కలేకపోయిన ప్రొజెక్ట్ ను రామ్ చరణ్ ఒకే చేశాడని తెలుస్తోంది. ఇలా వరుసబెట్టి మహేష్ రిజెక్ట్ చేసిన కథలను మెగా ఫ్యామిలీ ఒకే చేస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus