2014 నుండీ ‘జన గణ మన’ వార్తల్లో వినిపిస్తూ.. కనిపిస్తూ వస్తోంది. మొదట మహేష్ బాబుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ ఈ ప్రాజెక్టుని చేయలేకపోయాడు. పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ ఇది.అందుకే చాలా మంది హీరోలను కలిసి ఈ కథ చెప్పాడు. అందులో పవన్ కళ్యాణ్, ప్రభాస్, ‘కె.జి.ఎఫ్ యష్’ వంటి వారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఈ ప్రాజెక్టు చేయడానికి ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వల్ల చివరికి విజయ్ దేవరకొండ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
ఈ ప్రాజెక్టు లేటయ్యే కొద్దీ పూరిలో కసి పెరిగి చివరికి దీనిని పాన్ ఇండియా మూవీగా మలచాలి అని ఫిక్స్ అయ్యాడు. ఈరోజు ఆ దిశగా మొదటి అడుగు వేసాడు. ‘జె జి ఎమ్’ పేరుతో ఈ ప్రాజెక్టు ఈరోజు ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది.మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంది.2023 వ సంవత్సరం ఆగస్ట్ 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు కూడా ప్రకటించారు. పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
విజయ్ దేవరకొండతో పూరి తెరకెక్కిస్తున్న రెండో మూవీ ఇది. వీరి కాంబినేషన్లో ఆల్రెడీ ‘లైగర్’ తెరకెక్కుతుంది. ఈ మూవీ 2022 ఆగష్ట్ 25న విడుదల కాబోతుంది. ఇక ‘జన గణ మన’ కి మరో స్పెషల్ అట్రాక్షన్ గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి చెప్పుకోవాలి. అతను ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు. ‘మై హోమ్’ రామేశ్వరరావు తో కలిసి ‘శ్రీకర స్టూడియో ప్రొడక్షన్’ పై ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వంశీ పైడిపల్లి వ్యవహరించనున్నట్టు స్పష్టమవుతుంది.
నిజానికి అతను ఈ ప్రాజెక్టుకి డబ్బులు పెట్టేది ఏమీ ఉండదు. ఒకవేళ పెట్టినా అది కొంతవరకు మాత్రమే..! లాభాల్లో మాత్రం కచ్చితంగా వాటా ఉంటుంది. థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ లో కూడా ఇతనికి వాటా ఉంటుంది.మరి నిర్మాతగా వంశీ పైడిపల్లి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.!
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?